బోయిన్ పల్లి నుండి కాళ్లకల్ వరకు జాతీయ రహాదారి 44 ను నాలుగు లైన్ల నుండి ఆరు లైన్ల వరకు విస్తరిస్తున్నందున రోడ్డు కిరువైపులా ఉన్న ప్రభుత్వ ఆస్తులు కోల్పోతున్న వివరాలు అందించవలసినదిగా జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ అధికారులకు సూచించారు

బోయిన్ పల్లి నుండి కాళ్లకల్ వరకు జాతీయ రహాదారి 44 ను నాలుగు లైన్ల నుండి ఆరు లైన్ల వరకు విస్తరిస్తున్నందున రోడ్డు కిరువైపులా ఉన్న ప్రభుత్వ ఆస్తులు కోల్పోతున్న వివరాలు అందించవలసినదిగా జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ అధికారులకు సూచించారు

బోయిన్ పల్లి నుండి కాళ్లకల్ వరకు జాతీయ రహాదారి 44 ను నాలుగు లైన్ల నుండి ఆరు లైన్ల వరకు విస్తరిస్తున్నందున రోడ్డు కిరువైపులా ఉన్న ప్రభుత్వ ఆస్తులు కోల్పోతున్న వివరాలు అందించవలసినదిగా జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జరిగిన సమావేశంలో మాట్లాడుతూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ 27 కిలో మీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నదని, అందులో మన జిల్లా నుండి రెండు కిలో మీటర్ల మేర రోడ్డు వెడల్పవుచున్నదని అన్నారు. ప్రస్తుతం 30 మీటర్ల వెడల్పు లో ఉన్న రోడ్డు 45 మీటర్లకు విస్తరిస్తున్నదని, అనగా రోడ్డుకు ఇరువైపులా ఏడున్నర మీటర్ల మేర విస్తరిస్తున్నదని అన్నారు. రోడ్డు విస్తరిస్తున్న ప్రాంతాలలో ఉన్న ఆర్.డబ్ల్యూ.ఎస్. నీటి పారుదల, అటవీ, బి.ఎస్.యెన్.ఎల్. వంటి శాఖల కు సంబంధించి డ్యామేజ్ అవుతున్న, లైన్లు పక్కకు జరుపుటకు, భూమి కోల్పోతున్న వాటికి నష్టపరిహారం అందించుటకు సర్వే చేపట్టి అంచనా నివేదిక అందజేయవలసినదిగా కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ఇందుకోసం సోమవారం కాళ్లకల్ దగ్గర ఉన్న బంగారమ్మ దేవాలయం నుండి జాయింట్ సర్వే చేపట్టుటకు జాతీయ రహాదారుల అధికారులంతో సమన్వయము చేసుకోవలసిందిగా కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రమేష్, ప్రతిమ సింగ్, యెన్.హెచ్. ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు, నీటిపారుదల శాఖా ఈ.ఈ.శ్రీనివాస రావు, ఆర్.డబ్ల్యూ.ఎస్. ఈ ఈ కమలాకర్, విద్యుత్ డి.ఈ. మల్లేశం, ఆర్.డి.ఓ. సాయి రామ్, ఫారెస్ట్ రేంజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post