బ్యాంకర్లకు నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించాలి : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

బ్యాంకర్లకు కేటాయించిన నిర్ధేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో చేసే విధంగా సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా లీడ్‌ బ్యాంక్‌ అధికారి హవేలిరాజుతో కలిసి బ్యాంకుల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులు, వ్యాపారస్తులు, ఎస్‌.సి., ఎస్‌.టి. కార్పొరేషన్లతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పథకాల కోసం అభ్యర్థులు చేసుకున్న దరఖాస్తులను త్వరగా పరిశీలించి పరిష్కరించే విధంగా కృషి చేయాలని తెలిపారు. ఖరీఫ్‌ సీజన్‌లో పంట రుణాల లక్ష్యం 1 వేయి 28 వేల కోట్ల రూపాయలు కాగా 77.45 శాతంతో 796 కోట్ల రూపాయలు రైతులకు అందించడం జరిగిందని, వ్యవసాయ ధీర్హకాలిక రుణాల లక్ష్యం 805 కోట్ల రూపాయలకు గాను 112 కోట్ల రూపాయలు సాధించడం జరిగిందని తెలిపారు. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు అందించే రుణ సదుపాయం వార్షిక లక్ష్యం 541 కోట్ల రూపాయాలు కాగా ఇప్పటి వరకు 28.21 శాతంతో 152 కోట్ల రూపాయలు
అందించడం జరిగిందని తెలిపారు. ప్రాధాన్యత రంగాల అభివృద్ధికి అందించే రుణ వార్షిక లక్ష్యం 3 వేల 409 కోట్ల
రూపాయలకు గాను 38 శాతంతో 1 వేయి 119 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని, ప్రాధాన్యేతర రంగాల రుణ వార్షిక లక్ష్యం 260 కోట్ల రూపాయలకు గాను 113 శాతంతో 295 కోట్ల రూపాయల రుణాలు అందించడం జరిగిందని, జిల్లా వారిక ప్రణాళిక లక్ష్యం 3 వేల 669 కోట్ల రూపాయలు కాగా సెప్టెంబర్‌ మాసం వరకు 39 శాతంతో 1 వేయి 414 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని తెలిపారు. 9 వేల 374 స్వయం సహాయక సంఘాలకు అందించే వార్షిక రుణ లక్ష్యం 350 కోట్ల రూపాయలు కాగా 4 వేల 771 సంఘాలకు 206 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ముద్ర రుణ సదుపాయం క్రింద 1 వేయి 137 మంది లబ్దిదారులకు 18 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని, స్టాండప్‌ ఇండియాలో 70 పరిశ్రమలకు 18 కోట్ల రూపాయలు రుణం అందించడం జరిగిందని తెలిపారు. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 74 ప్రాజెక్టులకు గాను 35 ప్రాజెక్టులకు మంజూరు చేయడం జరిగిందని, ఎస్‌.సి. కార్పొరేషన్‌ పథకంలో భాగంగా 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను 259 మంది లబ్బిదారులకు సంబంధించి గ్రౌండింగ్‌ చేయవలసి ఉందని, జిల్లాలో ఎన్‌.పి.ఎ. క్రింద 75 కోట్ల రూపాయలు వసూలు చేయవలసి ఉందని, సంబంధిత అధికారులు ఆ దిశగా దృష్టి సారించాలని ఆదేశించారు. పంట రుణాల లక్ష్యం 1 వేయి 713 కోట్ల రూపాయలకు గాను జనవరి మాసాంతం లోగా పూర్తి చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. అనంతరం 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 8 వేల 996 కోట్ల రూపాయలతో నాబార్డు రుణ ప్రణాళిక లక్ష్యాలను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి.శేషాద్రి, ఆర్‌.బి.ఐ. ఎ.జి.ఎం. శరత్‌, డి.డి.ఎం. తేజ్‌ రెడ్డి
యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కరీంనగర్‌ ఎ.జి.ఎం. టి. వంశీకృష్ణ, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ సీనియర్‌ మేనేజర్‌ (అడ్వాన్సెస్‌) పి.హరిగోపాల్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ మేనేజర్‌ రవీంద్రబాబు, ఆదిలాబాద్‌ సహకార బ్యాంక్‌ డి.జి.ఎం. టి.వెంకటస్వామి, డి.ఎ.సి. జి.ఎం. హరినాథ్‌, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post