బ్యాంకర్లతో డి.సి.సి, డి.ఎల్.ఆర్.సి.పై సమీక్ష సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన.      తేది:6.12.2021, వనపర్తి.

సకాలంలో లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు అందించి రైతన్నను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష బ్యాంకర్లను ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో డి.సి.సి, డి.ఎల్.ఆర్.సి.పై ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో బ్యాంకర్లు పంట రుణాలను సకాలంలో అందజేయాలని ఆమె ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల తోడ్పాటు కొరకు ముందుకు రావాలని ఆమె సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ సెప్టెంబర్ 30 వరకు అన్ని బ్యాంకులు అందించిన లక్ష్యాలను జిల్లా కలెక్టర్ వివరించారు. జిల్లాలో యిప్పటి వరకు 43 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 1 అనుమతి లభించిందని, మిగిలిన దరఖాస్తులు బ్యాంకులలో పెండింగ్ ఉన్నాయని కలెక్టర్ కు వివరించారు. జిల్లాల పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తల రుణాలను జాప్యం చేయరాదని వారికి రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి స్వయం సహాయక బృందాలకు ఆర్బీఐ రూ.20 లక్షల వరకు రుణాలు అందజేస్తామని ఎల్.డి.ఎం. తెలిపారు. బ్యాంకర్లలో ఏ స్కీములకు రుణాలు ఇస్తారు, స్కీములు వివరాలు తెలిపే బోర్డు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. రుణ మొత్తం పెంచేలా హెడ్ ఆఫీస్ వారితో మాట్లాడాలని బ్యాంక్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో వానకాలం ఖరీఫ్ పంట రుణాలు రూ. ఒక వెయ్యి 92 కోట్ల రుణం ఇవ్వడం జరిగిందని, 86.15 శాతము పంట రుణాలు అందించినట్లు ఆమె వివరించారు.  ప్రాధాన్యతా రంగాలకు రూ.1173 కోట్లు ఇవ్వడం జరిగిందని, 41% సాధించినట్లు ఆమె తెలిపారు. ఎం ఎస్ ఎం ఈ ద్వారా 191 శాతము రుణాలు అందించినట్లు ఆమె సూచించారు. జిల్లాలో ఏర్పాటు చేసుకున్న లక్ష్యానికి అనుగుణంగా 80% పంట రుణాలు అందించినందుకు గాను బ్యాంకర్లను జిల్లా కలెక్టర్ అభినందించారు.
జిల్లాలో (PLP) ప్రొజెక్టెడ్ లింక్డ్ ప్లాన్ ద్వారా 2022- 23 సంవత్సరానికి గానూ అంచనా రూ.2158 కోట్లు పంట రుణాలు (Crop Loans), రూ. 509.73 కోట్లు దీర్ఘకాలిక రుణాలు (Turms Loans), అగ్రి ఇన్ఫ్రాటెక్ ద్వారా రూ.86.60 కోట్లు, అనుబంధ రుణాలు  (Ancellary Loans) రూ. 222.75 కోట్లు, మొత్తం రుణాలు రూ. 2977.38 కోట్లు అంచనా రుణాలను తయారు చేసినట్లు ఆమె తెలిపారు. స్వయం ఉపాధి కొరకు దరఖాస్తు చేసుకునే వారికి బ్యాంకర్లు ఆర్బీఐ సూత్రాలను పాటించి రుణాలు అందేలా చూడాలని ఆమె సూచించారు. ఎమ్. ఎస్. ఎం. ఈ. ద్వారా రూ.120.30 కోట్లు ప్రణాళికలు తయారు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
ప్రధానమంత్రి ఫర్మలైజేశన్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ ద్వారా పొందే రుణాలలో 35 శాతం సబ్సిడీ అందుతుందని ఆమె తెలిపారు. వ్యవసాయ అనుబంధ, ఫిషరీస్, ఎనిమల్ హస్బండ్రీ కొరకు ఇచ్చే రుణాల అభివృద్ధికి బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని, 50 రోజుల లోపల వారి నుండి దరఖాస్తులు తీసుకొని, తద్వారా వారికి లోన్ మంజూరు అయ్యేలా చర్యలు చేపట్టాలని సంబంధిత జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో నాబార్డు అధికారి (డీడీఎం) శ్రీనివాస్, ఆర్బిఐ ఎల్.డి.వో.వైభవ్, ఎస్బిఐ ఆర్. ఎం. మధు బాబు, ఇండియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ.జి.యం.రామ్ ప్రసాద్, కంట్రోలర్ సంతోష్ కుమార్, వ్యవసాయ అధికారులు, బ్యాంక్ కంట్రోలర్ అధికారులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా చేయడమైనది.

Share This Post