బ్యాంకర్లతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్

ప్రచురణార్థం—1
అక్టోబర్ చివరి వరకు పెండింగ్ ఎస్సీ యూనిట్లను గ్రౌండ్ చేయాలి:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
ఉపాథి కల్పన పెంపొందించుటకు బ్యాంకర్లు సహకరించాలి
ఆర్థిక అక్షరాస్యత పెంపొందించే దిశగా ప్రత్యేక క్యాంపుల నిర్వహణ
వ్యవసాయ రుణాల సంఖ్య పెంపొందించేలా ప్రత్యేక చర్యలు
పెండింగ్ వీధి వ్యాపారుల రుణాలు త్వరితగతిన అందించాలి
రైతు రుణాలను రెన్యూవల్ చేసుకునేలా అవగాహన కల్పించాలి
ఆయిల్ ఫాం సాగు ప్రోత్సాహకానికి బ్యాంకర్లు సహకరించాలి
మహిళా సంఘాల రుణాలు లక్ష్యాలను ప్రతిమాసం పూర్తి చేయాలి
బ్యాంకర్లతో డిసిసి, డిఎల్ఆర్సి సమావేశం జూం కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి, సెప్టెంబర్ 28:
అక్టోబర్ చివరి వరకు జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఎస్సీ సబ్సిడీ యూనిట్ల గ్రౌండ్ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు . ఎస్సి ఎస్టీ కార్పోరేషన్ ల రుణాలు, ఆర్థిక అక్షరాస్యత, ఇతర అంశాల పై మంగళవారం డి.సి.సి, డి.ఎల్.ఆర్.సి సమీక్షా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ జూం ద్వారా నిర్వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, దానికి సంబంధించిన పురొగతి తదితర అంశాల ను లీడ్ బ్యాంక్ మేనేజర్ వివరించారు. ప్రజలు ఆర్థికంగా ఎదిగేందకు అవసరమైన సహకారం బ్యాంకింగ్ రంగం అందించాలని, అభివృద్ది కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ కోరారు. వ్యవసాయ రంగానికి సంబంధించి 2021-22 సంవత్సరం రూ.667 కోట్ల రుణం మంజూరి చేయడం లక్ష్యం కాగా జూన్ చివరి వరకు రూ.107.71 కోట్లు రుణాలు రైతులకు అందించామని అధికారులు తెలిపారు. రైతులకు రుణ లక్ష్యాలు చేరుకోవడంలో మరింత పురొగతి సాధించాల్సి ఉందని, రైతులు తమ రుణాలను రెన్యూవల్ చేసుకునే అంశం పై వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. రైతులకు రుణాలు మంజూరు లక్ష్యాల చేరుకోకపోవడం పై బ్యాంకుల వారిగా కలెక్టర్ సమీక్షించారు.
మహిళలు ఆర్థికంగా ఉన్నతస్థాయికి చేరుకునేలా ప్రభుత్వం అందించే స్వశక్తి సంఘాల రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు. మన జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 3421 స్వశక్తి సంఘాలకు రూ.163.75 కోట్లు రుణాలు అందించామని, మెప్మా కింద 165 స్వశక్తి సంఘాలకు రూ.10.41 కోట్ల రుణాలు అందించామని అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో మహిళా సంఘాలకు రుణ లక్ష్యం చేరుకోవాలని, ప్రస్తుత సంవత్సరం 9310 సంఘాలకు దాదాపు రూ.338 కోట్ల రుణం అందించడం లక్ష్యంగా ఉందని, ప్రణాళికాబ్దంగా ప్రతి మాసం లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ అన్నారు ఎస్సి కార్పోరేషన్ రుణాలపై సమీక్షిస్తూ 2017-18 సంవత్సరానికి సంబంధించి 615 యూనిట్ల సబ్సిడి విడుదల అయినప్పటికి 539 మాత్రమే గ్రౌండ్ అయ్యాయని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వం సబ్సీడి విడుదల చేసిన వారి అక్టోబర్ చివరి వరకు యూనిట్లను గ్రౌండ్ చేసేలా బ్యాంకర్లు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు యువతకు స్వయం ఉపాధి పెంపొందించడానికి ప్రధానమంత్రి ఉపాథి కల్పన పథకం కింద 92 ప్రాజేక్టులు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 17 ప్రాజేక్టులు మంజూరు చేసామని, పెండింగ్ లో ఉన్న వాటిని పరిశీలించి త్వరగా మంజూరు చేయాలని తెలిపారు. జిల్లాలో డిజీటల్ పేమెంట్స్ అధికంగా వుండేలా చుడాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో ఆర్థిక అక్షరాస్యత పెంపొందించడానికి బ్యాంకులు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆత్మనిర్భర్ భారత్ కింద జిల్లాలో చిన్న మరియు సూక్ష్మ పరిశ్రమలకు సహకారం అందించాలని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 349.48 కోట్ల రుణం అందించడం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 1226 మందికి 83.51కోట్ల రుణం అందించామని తెలిపారు. జిల్లాలో అర్హులై దరఖాస్తు చేసుకున్న వీధి వ్యాపారులకు రుణం మంజూరు చేసి నగదు అందించాలని కలెక్టర్ ఆదేశించారు
.

బ్యాంకర్లతో జూం ద్వారా సమావేశం నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) కుమార్ దీపక్ ,లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేష్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్, ఆర్బీఐ ఎజిఎం అనిల్ కుమార్, డిడిఎం నాబార్డు అనంత పాట్నా, అందరూ జిల్లా అధికారులు,అన్ని బ్యాంక్ శాఖలల ఆర్. ఎం.లు,వివిధ బ్యాంకు మేనేజర్లు , సంబంధిత అధికారులు, తదితరులు ఈ సమీక్షలో పాల్గోన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి, పెద్దపల్లి చే జారీచేయనైనది.

Share This Post