బ్యాంకర్లు చిరు వ్యాపారులకు విరివిగా రుణాలు అందించి వారిని ప్రోత్సాహించాలని జిల్లా కలెక్టర్ నిఖిల…

బ్యాంకర్లు చిరు వ్యాపారులకు విరివిగా రుణాలు అందించి వారిని ప్రోత్సాహించాలని జిల్లా కలెక్టర్ నిఖిల బ్యాంకర్లను కోరారు.

బుధవారం స్థానిక సత్యభారతి ఫింక్షన్ హాలులో అజాదీకే అమృత్ మహోత్సవ్ లో
భాగంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించిన ప్రజా చేరువ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన గవించి కార్యక్రమాన్ని ప్రారంభించినరు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, బ్యాంకింగ్ ఔట్ రిచ్ కార్యక్రమంలో వివిధ బ్యాంకర్లు పాల్గొని పెద్ద ఎత్తున రుణాలను సహాయక బృందలకు అందజేయడం అభినందనీయమన్నారు. ఇదే విధంగా ప్రతి వినియోగదారునికి బ్యాంకింగ్ సేవలు విరివిగా అందించాలన్నారు. ఈ సందర్బంగా వివిధ జాతీయ బ్యాంకుల ద్వారా రూ. 28.30 కోట్ల రుణాలను జిల్లా మహిళా సమాఖ్య సంఘాలకు అందజేశారు. రూ. 1.39 కోట్ల రుణాలను అర్బన్ మహిళా సంఘాలకు రుణాల చెక్కును కలెక్టర్ అందించారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో దాదాపు 500 మంది వీధి వ్యాపారులకు రూ. 1.15 కోట్ల రుణాలు అందజేయడమైనది. బ్యాంక్ అఫ్ బరోడా తాండూర్ శాఖ ద్వారా రూ. 2.65 కోట్ల ఒక లబ్ధిదారునికి హోసింగ్ లోన్ అదజేయడమైనది. బ్యాంకర్లు, ప్రభుత్వ శాఖల అధికారులు పరస్పర సహకారంతో అధిక మొత్తంలో రుణాలను అందజేయాలని, అలాగే అందజేసిన రుణాలను తిరిగి రికవరీ చేయాలని ఈ సందర్బంగా కలెక్టర్ సూచించారు. అంతకు ముందు ఆర్థిక అక్షరాస్యత, ఋణ వితరణ, సామజిక భద్రత పథకాలపై వినియోగదారులకు బ్యాంకర్లు అవగాహన కల్పించడం జరిగినది. బ్యాంకులలో మంచి ప్రతిభ చూపిన కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్లకు ప్రశంస పత్రాలు అందించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో DRDA PD కృష్ణన్, మున్సిపల్ కమీషనర్ శరత్చంద్ర, HD CCB DGM సత్యప్రసాద్, నాబార్డ్ DDM ప్రవీణ్ కుమార్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చీఫ్ మేనేజర్ వెంకటస్వామి, UBI చీఫ్ మేనేజర్ శ్రీనివాస్, SBI చీఫ్ మేనేజర్ అను ప్రభ, SBI జనరల్ మేనేజర్ శ్రీరామ కృష్ణ, SLBC SDI AGM సత్య హరిప్రసాద్, SBI RACC చీఫ్ మేనేజర్ ప్రశాంత్ ఆనంద్, కేక్ మేనేజర్ రామానుజ నాయలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post