బ్యాంకర్లు /డిపార్ట్మెంట్ అధికారులతో జిల్లా కలెక్టర్ ఎం. హరిత అధ్యక్షతన కో ఆర్డినేషన్ సమావేశం జరిగింది .

ఈరోజు కాన్ఫెరెన్స్ హాల్లో బ్యాంకర్లు /డిపార్ట్మెంట్ అధికారులతో జిల్లా కలెక్టర్ ఎం. హరిత అధ్యక్షతన కో ఆర్డినేషన్ సమావేశం జరిగింది .

ఈ సమావేశంలో పంటరుణాలు ,స్వయం సహాయక సంఘాల టార్గెట్ &అఛీవ్మెంట్ మరియు NPA రికవరీ గురించి చర్చించడం జరిగింది .

ముఖ్యంగా జిల్లాలో స్వయం సహాయక సంఘాల (SHG) టార్గెట్ 420 కోట్లకు గాను 56.27 కోట్లు అయినదని ,అలాగే పంట రుణాల్లో (వానాకాలానికి )791 కోట్ల రుణాలకు గాను జూన్ 2021 వరకు 192 కోట్ల రుణాలు వివిధ బ్యాంకుల నుండి మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా,కెనరా బ్యాంకు ,ఐఓబీ ,APGVB ,మరియు DCB లో వున్న NPA ల రికవరీ మరియు షెడ్యూల్ తయారు చేసి DRDA మరియు వ్యవసాయశాఖల అధికారులను బ్యాంకు రికవరీలో సహాయపడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించడం జరిగింది .

అలాగే పీఎం స్వనిది కింద తీసుకున్న రుణాలను వెంటనే రికవరీ చేయించాలని PD MEPMA ని ఆదేశించారు .

ఈ కార్యక్రమంలో జిల్లా ఫుడ్ ప్రోసెసింగ్ &మ్యానిఫేచ్చేరింగ్ (PMFME )క్రింద వచ్చిన అప్లికేషన్లు 57 ని వెంటనే బ్యాంకు గైడ్లైన్స్ ప్రకారం మంజూరు చేయాలని LDM సత్యజిత్ బ్యాంకర్లను కోరారు .Share This Post