బ్యాంకింగ్ రంగంలో డిజిటల్ సేవలు:: ఆర్బిఐ జనరల్ మేనేజర్ (ఎఫ్ఫైడిడి) ఎం. యశోద బాయ్

ప్రచురణార్థం-1
జనగామ, డిసెంబర్ 30:
బ్యాంకింగ్ రంగంలో ఆర్ధిక పరమైన లావాదేవీలు డిజిటల్ పరిజ్ఞానం తదితర అంశాలపై గురువారం జనగామ పట్టణం ఎన్ఎంఆర్ గార్డెన్స్ లో ఆర్బిఐ జనరల్ మేనేజర్ (ఎఫ్ఫైడిడి) ఎం. యశోద బాయ్, హైదరాబాద్ అధ్యక్షతన జిల్లాలోని బ్యాంకర్లకు, స్వయం సహాయక బృందాలకు, వీధి వ్యాపారులకు అవగాహానా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మారుతున్న జీవన ప్రమాణంలో అతి ముఖ్యమైనవి ఆర్ధిక పరమైన లావాదేవీలని అందుకు బ్యాంకులు ప్రజలకు మెరుగైన వేగవంతమైన, పారదర్శక సేవలు అందించుటకు డిజిటల్ పరిజ్ఞానం ఎంతో అవసరమని అన్నారు.
అందుకు అనుగుణంగా బ్యాంకు సిబ్బంది పనిచేయాలని ఆమె సూచించారు.
మరో అతిధి ఆర్బిఐ మేనేజర్ సాయిచరణ్ మాట్లాడుతూ నకిలీ కరెన్సీ ఏ విధంగా గుర్తించాలో తగు సూచనలు ఇచ్చారు.
వ్యాపారులు, ప్రజలు పది రూపాయల నాణేలను నిరాకరించకూడదని అన్నారు. అనంతరం డిజిటల్ పరిజ్ఞానం పై కళాజాతులచే బుర్రకథ, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ టి.వి. శ్రీనివాస రావు, డిజీఎం ఎస్బిఐ బాలానంద్, డిజీఎం యుబిఐ శంకర్ లాల్, ఎజిఎం ఎస్బిఐ ఎండి అల్లిం ఉద్దిన్, ఎజిఎమ్ నాబార్డ్ ఎల్.చంద్రశేఖర్, ఆర్ఎం ఎపిజివిబి. విజయ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post