జనగామ, ఆగస్టు 4: ప్రజలు బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సిజిఎం, బ్యాంకింగ్ ఓంబుడ్స్ మన్ టి. శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జనగామ జిల్లా కేంద్రంలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని సిజిఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాల్లో 98 ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను ఆర్బీఐ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా జిల్లాలో 3 కేంద్రాలు ఏర్పాటుచేయనున్నట్లు ఆయన అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం ప్రారంభిస్తుండగా, దేవరుప్పుల, స్టేషన్ ఘనపూర్ లలో త్వరలో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలు పేస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నడుస్తాయని ఆయన అన్నారు. ఈ కేంద్రాలు నెలలో కనీసం 10 శిబిరాలు నిర్వహించి, బ్యాంకింగ్, వినియోగదారుల సేవా కేంద్రాలు అందిస్తున్న సేవలు, ప్రభుత్వ సహకారంతో బ్యాంకులు చేపట్టే పధకాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తాయన్నారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ టివి. శ్రీనివాసరావు, నాబార్డ్ డీడీఎం చంద్రశేఖర్, ఆర్బీఐ ఎల్డివో శివరామన్ లు ఈ కేంద్రాలను పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు. ఈ కేంద్రాలతో బ్యాంకింగ్ సేవల పట్ల ప్రజల్లో చైతన్యం రావడంతో పాటు, ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరుతాయన్నారు.
కార్యక్రమంలో ఎస్బీఐ ద్వారా 612 స్వయం సహాయక సంఘాలకు 25 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు పంపిణీ చేశారు. ప్రధానమంత్రి సురక్షా భీమా పధకంలో 2 లక్షల భీమా చెక్కును భీమాదారుని కుటుంబానికి అందించారు.
ఈ కార్యక్రమంలో ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ కె. నిఖిల, నాబార్డ్ సిజిఎం వై. కృష్ణారావు, ఎస్బిఐ సిజిఎం అమిత్ జింగ్రామ్, ఆర్బీఐ జిఎం ఎం. యశోదాబాయి, జిఎం క్రిషన్ శర్మ, ఎల్డిఎం టివి. శ్రీనివాసరావు, పేస్ కార్యదర్శి వీఎస్. రెడ్డి, బ్యాంకర్లు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.
You Are Here:
Home
→ బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి:: సిజిఎం, బ్యాంకింగ్ ఓంబుడ్స్ మన్ టి. శ్రీనివాసరావు
You might also like:
-
కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులి అర్పించిన అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్,
-
శుక్రవారం నాడు జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య, ఎన్నికల నోడల్ అధికారులతో ఎన్నికల నేపథ్యంలో పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, జనగామ రిటర్నింగ్ అధికారులు అదనపు కలెక్టర్లు రోహిత్ సింగ్, సుహాసిని లతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు,
-
శనివారం నాడు, కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో ఎన్నికల నోడల్ అధికారులు, ఆర్ఓస్,ఈఆర్ఓస్,ఏసిపిలు, ఎన్నికల విభాగం సిబ్బంది, డిసిపి సీతారామ్, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్, లతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య,
-
పాలకుర్తి మెగా జాబ్ మేళాకు భారీ స్పందన విజయవంతంగా జాబ్ మేళా… విశేషంగా పాల్గొన్న ఉద్యోగార్థులు పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, తొర్రూరు, రాయపర్తి, పెద్దవంగర మండలాల నుంచి భారీగా తరలివచ్చిన ఉద్యోగార్థులు