బ్యాంకులు అందించే ఋణ పథకాలపై అవగాహన కల్పించుకొని లబ్ది పొందాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి లబ్దిదారులకు సూచించారు.

పత్రికా ప్రకటన                                                                తేది 28-10- 20 21

బ్యాంకులు అందించే ఋణ పథకాలపై అవగాహన కల్పించుకొని లబ్ది పొందాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి లబ్దిదారులకు సూచించారు.

గురువారం ఉదయం పట్టణం లోని ఎస్.వి ఈవెంట్ హాలు నందు యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా, లీడ్ బ్యాంకు ఆధ్వర్యం లో ఆజాద్ కి అమృత్ మహోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన ఋణ విస్తరణ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్  మాట్లాడుతూ  బ్యాంకుల ద్వారా మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ లోన్లు, పి.ఎం స్వానిది, మహిళా గ్రూప్ సభ్యులకు, వీది వ్యాపారస్తులకు, రైతులకు వ్యవసాయ అనుబంధ లోన్లు, వ్యాపార వేత్తలతో పాటు కార్ లోన్లు, వ్యక్తిగత లోన్లు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా జిల్లా లోని చేనేత కార్మికులకు ముద్ర లోన్లు మంజూరు చేయాలనీ బ్యాంకర్లను కోరారు.  ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో పథకాల కింద అతి తక్కువ వడ్డీ తో వ్యక్తి గత, కొత్త యూనిట్లు పెట్టుకోవడానికి ఋణాలు అందించడం జరుగుతుందని, ముద్ర మరియు పి.ఎం.స్వానిది, రుణాలు ఇవ్వడానికి ధరకాస్తులు స్వీకరించి అర్హత కలిగిన వారందరికీ ఋణాలు అందజేయాలని, రుణాలు పొందిన లబ్ధిదారులు సక్రమంగా వాయిదాలను చెల్లించి మరిన్ని ఋణ సదుపాయాలు పొందవచ్చని సూచించారు. అన్ని బ్యాంకులు కలసి ఋణ సదుపాయం కల్పించడం జరుగుతుందని తెలిపారు. వ్యాపారం కోసం పొందిన లోన్ ను అందుకు మాత్రమే వాడాలని, అప్పుడే వ్యాపారం లో అభివృద్ధి చెందుతారని అన్నారు. తీసుకున్న రుణాల వాయిదాలను సక్రమంగా చెల్లెంచే వారికి బ్యాంకర్లు మళ్ళీ ఋణాలు పొందేందుకు  అవకాశాలు కల్పిస్తారని సూచించారు.

ఈ సందర్బంగా DRDA ద్వారా ఎంపికైన SHG మహిళా గ్రూప్ సభ్యులకు 15.88 కోట్ల రూపాయల ఋణ చెక్కును అందజేశారు. వివిధ బ్యాంకు ల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు.

యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా డి.జి.ఎం. జి.ఎన్.వి రమణ, మాట్లాడుతూ బ్యాంకర్ల సహకారంతో ప్రతి ఒక్కరికి బ్యాంకు రుణాలు అందేలా కృషి చేయడం జరుగుతుందని,దేశ అభివృధి కొరకు కేంద్ర ప్రభుత్వం ముద్ర లోన్ లు ప్రవేశ పెట్టిందని,  పథకాలన్నీ ముందుకు తీసుకెళ్లేందుకు రుణ విస్తరణ కార్యక్రమం ఏర్పాటు  చేయడం జరిగిందని,  వ్యాపారస్తులు ఆర్థికంగా ఎదగాలంటే తీసుకున్న రుణాలు సద్వినియోగం చేసుకోవాలని, వాయిదాలను సకాలంలో చెల్లిస్తే మరోసారి బ్యాంకు ఋణం  పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.

కార్యక్రమం లో అదనపు కలెక్టర్ శ్రీ హర్ష, డి.ఆర్.డి.ఎ ఉమాదేవి, ఎల్.డి.ఎం సురేష్ కుమార్, ఎస్.బి.ఐ ఎ.జి.ఎం మధుబాబు, ఎపిజివిబి ఆర్.ఎం శామ్యూల్, షన్ముఖ్, నాబార్డ్, కే.వి.ఐ.సి అధికారులు, లబ్దిదారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

———————————————————————————

జిల్లా పౌర సంబంధాల అధికారి  జోగులాంబ గద్వాల్  గారిచే జారీ చేయబడినది.

 

 

 

Share This Post