బ్యాంకులు అర్హులైన వారికి రుణాలు సకాలంలో అందించాలి
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్
వివిధ సంక్షేమ శాఖలు చేపడుతున్న ఆర్థిక చేయూత పథకాలు, అర్హులైన లబ్దిదారులకు, పంట రుణాలు రైతులకు సకాలంలో చేరేలా బ్యాంకర్లు, సంబంధిత శాఖాధికారులు సమిష్టిగా కృషి చేయాలనీ జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్ సూచించారు.
బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన బ్యాంకర్ల సమావేశంలో రెవెన్యూ అధికారి లింగ్యానాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ పధకాల అమలులో లబ్దిదారులకు ఎటువంటి జాప్యం లేకుండా రుణ వితరణ చేయాలన్నారు.నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణిత వ్యవధిలోగా గ్రౌండింగ్ చేయాల్సిన బాధ్యత బ్యాంకు అధికారులదేనని అన్నారు. సంక్షేమ శాఖాధికారులు వారికీ నిర్దేశించిన బ్యాంకులలో పెండింగ్లో ఉన్న, గ్రౌండింగ్ కానీ యూనిట్లను పరిష్కరించేందుకు గాను బ్యాంకు అధికారులను తరచుగా సంప్రదిస్తూ గ్రౌండింగ్ పూర్తీ చేయాలన్నారు.
వివిధ సంక్షేమ శాఖలకు చెందిన సబ్సిడీ రిలీజ్ అయిన యూనిట్లకు వెంటనే గ్రౌండింగ్ చేయాలనీ, గ్రౌండింగ్ పూర్తీ అయిన యూనిట్లకు యూటిలైజషన్ సర్టిఫికెట్ సంబంధిత అధికారులకు పంపాలన్నారు. బ్యాంకర్లు లబ్దిదారుల యూనిట్లను గ్రౌండింగ్ చేసే సమయంలో అవసరమైనంత మేరకు ధ్రువపత్రాలను నిర్దేశించిన సమయంలో గ్రౌండింగ్ చేయాలన్నారు. పీఎంస్వానిది, పీఎంఇ జి పి మరియు ఎస్సి, ఎస్టీ కార్పొరేషన్ కి సంబందించిన అన్ని పథకాలు పూర్తీ చేయుటకు కృషి చేయాలని, పంట రుణాలు పంపిణీ, వ్యవసాయ కాలపరిమితి రుణాలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇచ్చే రుణాలు చిన్న, సన్నకారు రైతులకు అందించడానికి కృషి చేయాలని బ్యాంకర్లకు తెలిపారు.
అనంతరం జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ. ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు రూ. 7,205 కోట్లకు గాను జిల్లా బ్యాంకులు రూ. 6,935 కోట్ల ప్రగతిని సాధించడం జరిగిందని వివరించారు. మహిళా సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు బ్యాంకు లింకేజీ, పీఎంఈజీపీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ముద్ర రుణాలకు ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన పూర్తి చేయాలని వివరించారు. దీంతో పాటు ఆర్ ఆర్ఎస్ఈటీఐ, ఎఫ్ఎల్సీ కేంద్రాల సేవలను వినియోగించుకోవాల్సిందిగా కిషోర్ కుమార్ కోరారు. అనంతరం నాబార్డు డీడీఎం ఆధ్వర్యంలో (potential Linked Credit Plan పీఎల్పీ – 2022 – 2023 సంవత్సరానికి గాను జిల్లాప్లాన్ను ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో దేవసహాయం, కెనెరా బ్యాంక్ డీజీఎమ్, మేడ్చల్ జిల్లా రీజినల్ ఆఫీస్ హెడ్ అనంత జలోన్హా, యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంకు ప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ అధికారులతో పాటు వ్యవసాయ, మత్స్యశాఖ, జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారులు, ఆయా బ్యాంకుల మేనేజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.