పత్రికా ప్రకటన
తేదీ 18.03.2023
నాగర్ కర్నూల్ జిల్లా.
బ్యాంకులు మరియు ఖాతాదారులకు లోక్ అదాలత్ ఒక ప్రయోజనం – కార్యదర్శి జిల్లా లీగల్ సెల్ సర్వీస్ అథారిటీ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జీ సబిత
118 మంది బ్యాంకు ఖాతాదారులకు బ్యాంకు రుణ విముక్తితో 16 లక్షల 97 వేల 837 రూపాయలను బ్యాంకులకు చెల్లింపు
లోక్ అదాలత్లు, వివాదాల పరిష్కారానికి ముందస్తు ప్రయత్నాలు చేస్తుందని, ఖాతాదారులతో 118 మంది ఖాతాదారులకు విముక్తి కల్పించడంతోపాటు, బ్యాంకులకు 16,97,837 రూపాయలను రుణాలు అందించిన బ్యాంకులకు మేలు చేశాయని ప్రధాన సీనియర్ న్యాయమూర్తి, కార్యదర్శి జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సబిత అన్నారు.
శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కోర్టు ఆవరణలో డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో బ్యాంక్ కేసుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన లోక్ అదాలత్ను ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….. వివాదాలను పరిష్కరించడానికి
ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం ఉత్తమమైనదని, లోక్ అదాలత్, మధ్యవర్తిత్వం మరియు రాజీ కూడా ఉన్నాయన్నారు.
నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి కొల్లాపూర్ నాగర్ కర్నూల్ అచ్చంపేటలో నేడు
చర్చలు, పరస్పర అంగీకారంతో కేసులు పరిష్కరించుకోవడం వల్ల ఎవరూ గెలవరు, ఓడిపోరు. అని ఆమె అన్నారు.
రుణం మంజూరైన తర్వాత కస్టమర్ క్రెడిట్కు జోడించబడే ప్రాసెస్ ఫీజు మరియు వడ్డీవివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవడం వినియోగదారులకు మేలు చేస్తుంది, తద్వారా వారు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యాజ్యానికి ముందు దశలోనే వివాదాలను పరిష్కరించుకోవాలని, రుణదారులు తమ మొండిబకాయలను బ్యాంక్ కు ఇరుపక్షాల అంగీకారంతో నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ఏకకాల చెల్లింపులతో (వన్ టైం సెటిల్మెంట్) ద్వారా 118 మందిని రుణ విముక్తిదారులుగా చేసి, బ్యాంకుల మొండి బకాయిలు 16,97,837 రూపాయలను బ్యాంకులకు చెల్లించడం జరిగిందని ఆమె తెలిపారు.
వ్యవసాయం మరియు పశువుల రుణాల లబ్ధిదారులు అసలు రుణం మొత్తంలో కొంత భాగాన్ని మాత్రమే పొందారని, అయితే చాలా సంవత్సరాలు రుణాలు చెల్లించకుండా ఉండడంతో వడ్డీ మరియు అస్సలు రుణాలు పెరుగుతాయని, ఇప్పటికప్పుడు రుణాలను చెల్లిస్తే ఆర్థిక భారం తగ్గుతుందని ఆమె తెలిపారు.
నేటి లోక్ అదాలకు నాగర్ కర్నూల్ లోక్ అదాలత్ సభ్యుడు బి రామచందర్,యూనియన్ బ్యాంకు మేనేజర్లు నాగలక్ష్మి, సందీప్, అరుణ్ కుమార్,మరియు న్యాయవాదులు కోర్టు సిబ్బంది కేశవరెడ్డి, దేవిక తదితరులు పాల్గొన్నారు.
…………………………..
జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి కార్యాలయం నాగర్ కర్నూల్ నుండి జారీ చేయడమైనది.