బ్యాంకు రుణాలతో నిరుపేదల ఆర్థిక ప్రగతి అభివృద్ధి చెందాలి….

ప్రచురణార్థం

బ్యాంకు రుణాలతో నిరుపేదల ఆర్థిక ప్రగతి అభివృద్ధి చెందాలి.

మహబూబాబాద్ అక్టోబర్ 8.

నిరుపేదలు ఆర్థిక అభివృద్ధి చెందేందుకు బ్యాంకు రుణాలు తోడ్పాటును అందిస్తాయి అధికారులు ఆ దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో బ్యాంకర్లు, అధికారులతో డి సి సి dlrc కమిటీ సమావేశాన్ని కలెక్టర్ లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

గతంలో పంట రుణాలు 100% సాధించగా ప్రస్తుతం 16 శాతం సాధించడంలో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బ్యాంకర్లు అధికారులు సమన్వయాన్ని పెంచుకోవాలన్నారు.

పంట రుణాల చెల్లింపుల్లో 88 కోట్లు ఎస్బిఐ నుండి ఉండగా మిగతా శాఖల వివరాలు కూడా ఇవ్వాలన్నారు మధ్యతరగతి లో పారిశ్రామికంగా సూక్ష్మ రుణాల ను త్వరితగతిన మంజూరు చేయాలన్నారు.

గ్రామాలలోని రైతు వేదికలలో సమావేశాలు ఏర్పాటు చేసి బ్యాంకు రుణాల పై ఖాతాదారులకు అవగాహన పరచాలి అన్నారు.
జిల్లా పరిశ్రమల అధికారి ఆదేశిస్తూ 38 యూనిట్లకు 100 శాతం మంజూరు చేయాలన్నారు.

నిరుపేదల ఆర్థిక ప్రగతిని పెంచేందుకు పాడి పరిశ్రమ అభివృద్ధి పరచాలని కలెక్టర్ తెలియజేశారు.

పంట రుణాలలో గతంలో రుణాలను మంజూరు చేసినట్లుగానే ప్రస్తుతం కూడా మంజూరు చేయాలన్నారు.

ఈ కమిటీ సమావేశంలో నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్ రిజర్వ్ బ్యాంక్ మేనేజర్ పూర్ణిమ డిఆర్డిఎ పిడి సన్యాస య్య వ్యవసాయ అధికారి చత్రు నాయక్, ఉద్యాన అధికారి సూర్యనారాయణ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు పరిశ్రమల అధికారి సత్యనారాయణ పశుసంవర్ధక అధికారి సుధాకర్ బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు
—————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post