బ్రిడ్జి నిర్మాణపు పనులు చేపట్టేందుకు క్రిస్టియన్ మత గురువులు సహకరించాలి : వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి

వికారాబాద్ బ్రిడ్జి నిర్మాణపు పనులు చేపట్టేందుకు సహకరించాలని క్రిస్టియన్ మత గురువులను జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి కోరారు.

గురువారం కలెక్టర్ కార్యాలయంలోని కన్ఫరెన్స్ హాలులో మెథడిస్ట్ చర్చ్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల సౌకర్యార్థం రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టేందుకు సహకరించాలని, అవసరమైన స్థలం కేటాయిస్తే పనులు ప్రారంభించుకునేందుకు వీలు పడుతుందని అన్నారు. నిబంధనల మేరకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందించడం జరుగుతుందని, ఇట్టి విషయంలో త్వరగా స్పందిస్తే ఏప్రిల్ మొదటి వారంలో పనులు చేపట్టుటకు వీలు పడుతుందన్నారు. వచ్చే జూన్ మాసం తర్వాత వర్షాలతో పాటు ఎన్నికల వాతావరణం మొదలవుతున్నందున సంప్రదింపులతో అన్ని సమస్యలను అధిగమించి, బ్రిడ్జి పనులు చేపట్టే విధంగా సహకారం అందించాలని సూచించారు.

ఈ సమావేశంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, వికారాబాద్ ఆర్ డి ఓ విజయ కుమారి, తహసీల్దార్ వహీదాహతున్, ఆర్ అండ్ బి
డి ఈ శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర లతో పాటు మెథడిస్ట్ చర్చ్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సభ్యులు రెవ. స్టీవెన్, జాన్ విక్టర్, సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post