భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలి. నీటి వసతి, పారిశుద్ధ్య నికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. జాతర విధులు నిర్వహిస్తున్న అధికారులు సమన్వయంతో కలసి పని చేయాలి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.

తేదీ.7.2.2023.
సూర్యాపేట.

జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం జాతర నిర్వహణలో భాగంగా పలు ప్రాంతాలను పరిశీలించి పనుల నిర్వహణ పై అధికారులకు దిశా నిర్దేశ్యం చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని జాతరలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయిస్తూ నిర్వహిస్తుందని జాతరలు ఐక్యతకు ప్రతీకలుగా నిలుస్తాయని అన్నారు. జాతరలో ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కేంద్రాలలో వచ్చే భక్తులకు నిరంతరం సేవలు అందాలని సూచించారు. విద్యుత్, పారిశుధ్యమ్ , త్రాగునీరు, స్నానాలగదులు,మరుగు దొడ్ల వద్ద నిరంతరం నీటికీ అలాగే పోలీస్ కాంట్రల్ రూమ్ లో సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించి నిరంతరం నిఘా ఉంచాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. గుట్టపై ఉన్న శౌ ర శాలను పెంచనున్నట్లు మంత్రి తెలిపారు. మెడికల్ స్టాల్ ను పరిశీలించి ఆరోగ్యం సరిగా లేని భక్తులకు మెరుగైన సేవలు అందించాలని చికిత్స పొందుయున్న వారిని పలకరించారు. జాతర మరో రెండు రోజులు కొనసాగుతున్నందున చిన్న పిల్లలు, వృద్ధులు జాతరలో తప్పిపోతే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు.అనంతరం విచారణ కేంద్రాలను సందర్శించి అధికారులకు వివిధ పనుల నిర్వహణ పై దిశానిర్దేశం చేశారు. వ్యర్ధ పదార్థాలను వెనువెంటనే తొలగించాలని ఆలయ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ముందుగా ఆలయ మర్యాదలతో దేవస్థానంలో స్వాగతం పలికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Share This Post