భగీరథుడు మహా జ్ఞాని. పరోపకారానికి పెట్టింది పేరు. దీక్షకు, సహనానికి ప్రతిరూపం. ఎంత కష్టాన్నయినా లెక్కచేయకుండా, అనుకున్నది సాధించేవారిని భగీరథుని తో పోలుస్తారు – ఆదనపు కలెక్టర్ పద్మజా రాణి

భగీరథుడు మహా జ్ఞాని. పరోపకారానికి పెట్టింది పేరు. దీక్షకు, సహనానికి ప్రతిరూపం. ఎంత కష్టాన్నయినా లెక్కచేయకుండా, అనుకున్నది సాధించేవారిని భగీరథునితో పోలుస్తారు. ఎవరైనా కఠోర పరిశ్రమ చేసి దేన్నయినా సాధిస్తే భగీరథ ప్రయత్నం చేశారని చెప్పుకుంటాం. కారణం భగీరథుడు ఎంతో కష్టపడి దివి నుండి గంగను భువికి తీసుకొచ్చారాన్ని జిల్లా ఆనపు కలెక్టర్ పద్మజా రాణి అన్నారు.  ఈ రోజు మహర్షి భగీరథ జయంతి ఉత్సవము బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాకలెక్టర్ కార్యాలయము లో ఘనంగా జరిగింది ఇట్టి కార్యక్రమములో  జిల్లా ఆనపు కలెక్టర్ మహర్షి భగీరథ చిత్ర పటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరము మహర్షి భగీరథ జీవిత చరిత్ర గురించి వివరించారు.

ఈ  కార్యక్రమములో,Rdo రామచందర్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి కృష్ణమాచారి, జిల్లాసాంఘిక సంక్షేమ అధికారి కన్యాకుమారి ad అగ్రికల్చర్ సుధాకర్ మరియు ఇతర అధికారులు, కార్యాలయ సిబ్బంది సాగర సంఘం నాయకులు ఆంజనేయులు, వెంకటయ్య, విష్ణు,తదితరులు పాల్గొన్నారు.

Share This Post