భవన నిర్మాణ అనుమతులు త్వరితగతిన మంజూరు ఇవ్వాలి
ఊరురా చెరువు పండుగను విజయవంతం చేయాలి
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్
0 0 0 0 0
మున్సిపాలిటీలలో నూతన భవన నిర్మాణాల అనుమతులను త్వరితగతిన మంజూరు ఇవ్వాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ మున్సిపల్ అధికారులను సూచించారు.
బుదవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ పనుల ప్రగతిపై మున్సిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ మరియు టెక్నికల్ సిబ్బందితో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భవన నిర్మాణాలకు అనుమతులు జారీ లో జాప్యం చేయరాదని, జాప్యం జరిగినట్లయితే మున్సిపల్ ఆక్ట్ ప్రకారం జరిమానా విధిస్తూ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
అనంతరం ఇరిగేషన్ అధికారులతో సమీక్షిస్తు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 2 నుండి 22 వరకు నిర్వహించనున్న ఉత్సవాలలో అందరు పాల్గోని విజయవంతం చేయాలని, జిల్లాలోని నాలుగు నియోజక వర్గాలలో చెరువుల పండుగలో ప్రజలు పెద్దమొత్తంలో బాగస్వాములు అయ్యేలా చూడాలని సూచించారు. జూన్ 8న నిర్వహించనున్న ఊరురా చెరువు పండగలో బాగంగా చెరవులను ఎంపిక చేసి చెరువు పరిసరాలు పరిశుభ్రంగా ఉండెలా పంచాయితి కార్యదర్శులు చూడాలని తెలిపారు. ఊరురా చెరువుల పండుగ సందర్బంగా ప్రతి నియోజక వర్గంలోని గ్రామాల్లో వేడుకలు బతుకమ్మ ముగ్గులు వేయాలని, మైసమ్మ బోనాలు నిర్వహించడంతో పాటు వచ్చిన వారికి బోజనాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతిరోజు నిర్వహించాల్సిన కార్యక్రమాలపై ముందుగానే సమావేశాలను నిర్వహించుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో కరీంనగర్, హుజురాబాద్ అర్డిఓలు ఆనంద్ కమార్, హరిసింగ్, డిపిఓ వీరబుచ్చయ్య, డిబ్ల్యుఓ సంద్యారాణి, ఎస్సి కార్పోరేషన్ అధికారి నాగర్జున, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు, ఇరిగేషన్ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గోన్నారు.