భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం దేశంలో హరిత తెలంగాణ గా మారనుందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సంస్కృతిక,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

పత్రికా ప్రకటన                                                              మహబూబ్ నగర్
7. 7 . 2021
____________.
భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం దేశంలో హరిత తెలంగాణ గా మారనుందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సంస్కృతిక,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
బుధవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయ ఆవరణలో తెలంగాణ గజిటెడ్ జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారం కార్యక్రమం లో పాల్గొని మొక్కలు నాటారు.
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆర్టీఎ కార్యాలయంలో ప్రతి సంవత్సరం మొక్కలు నాటడం ఆనవాయితీగా వస్తున్నదని, ఏ కార్యాలయంలో లేనివిధంగా ఆర్ టి ఏ కార్యాలయంలో పచ్చని మొక్కలతో కళకళలాడుతున్నదని అన్నారు. చెట్లు పర్యావరణానికి ఎంతో ముఖ్యమని, తెలంగాణ రాక పూర్వం రాష్ట్రంలో కరువు, కాటకాలు, వర్షాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, రాష్ట్రం వచ్చిన తర్వాత మొక్కలు నాటడం, ఇంకుడు గుంతలను తవ్వడంతో నీరు నిల్వ ఉండి వర్షాలు కూడా సమృద్ధిగా కురుస్తున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అవసరం అని, ప్రతి ఇంటి ముందు తప్పనిసరిగా మొక్కలు నాటాలని కోరారు .మొక్కల వల్ల వాతావరణ సమతుల్యం ఏర్పడుతుందని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో 10 శాతం గ్రీన్ లెవెల్ పెరిగిందని, రాష్ట్రం దేశంలోనే హరిత తెలంగాణ కాబోతున్నదని తెలిపారు. ప్రతి ఇంటిలో తప్పనిసరిగా 6 మొక్కలు పెట్టుకోవాలని ప్రతి ఓక్కరు తన గురించి, తన ఆరోగ్యం గురించి చెట్లు పెంచాల్సిన అవసరం ఉందని, అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరి పై కూడా మొక్కలు నాటే బాధ్యత ఉందని అన్నారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాక పూర్వం ఒక్క పార్క్ కూడా లేదని ,ఇప్పుడు 25 పార్క్ లతో పాటు, దేశంలోనే అతి పెద్దదైన 2097 ఎకరాల కలిగిన ఎకో పార్కు జిల్లాలో ఉందని అన్నారు.మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధికి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు సహకరించి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఆర్. వెంకటేశ్వర్లు ఆర్టీవో ప్రేమ లత ,ఎం వి ఐ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ డి ఓ పద్మశ్రీ, తెలంగాణ జిల్లా గజీటేడ్ అధికారుల సంఘం కార్యదర్శి బక్క శ్రీనివాసులు, బాలచందర్, విజయకుమార్, వెంకటేష్ తదితరులు ఉన్నారు .
అనంతరం మంత్రి కొత్త గంజ్ లో 20 లకధసల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సి సి రోడ్డుకు శంకుస్థాపన చేశారు.ప్రేమ్ నగర్ లో 5 లక్షల రూపాయలతో నిర్మించిన ఎస్ సి కమ్యూనిటీ హాలును ప్రారంభించారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందసలాల్ పవర్,మున్సిపల్ కమిషనర్ కె.సి.నర్సింహులు,వైస్ ఛైర్మన్ గణేష్ లు పాల్గొన్నారు.
____________

జారీ చేసినారు సహాయ సంచాలకులు, సమాచారశాఖ, మహబూబ్ నగర్ .

 

Share This Post