భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశాం: వి.టి.ఏ.డి.ఏ. వైస్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి

*భవిష్యత్తూ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశాం: VTADA వైస్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి*
——————————

వేములవాడ క్రమానుగత పట్టాణాభివృద్దికి,భవిష్యత్తు అవసరాలకు అనుగణంగా వేములవాడ టెంపుల్ ఏరియా డెవల్ మెంట్ అథారిటి మాస్టర్ ప్లాన్ తయారు చేసిందని వైస్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి తెలిపారు.

భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వేములవాడ సమగ్రాభివృద్ధికి అనుగుణంగా GIS ఆధారిత మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేశామని VTADA వైస్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి తెలిపారు.

VTADA మాస్టర్ ప్లాన్ ముసాయిదా పైన VTDA వైస్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్ VTDA పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో IDOC లోని కాన్ఫరెన్స్ హల్ నందు మొదటి సమావేశం నిర్వహించి చర్చించారు.

ఈసమావేశంలో ప్లానింగ్ శాఖ ముఖ్య అతిథిగా అధికారి చంద్రిక VTADA మాస్టర్ ప్లాన్ గురించి ప్రజాప్రతినిధులకు వివరించారు.

ఈ సంధర్భంగా VTADA వైస్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ…
వేములవాడ పట్టణం తో సహా 6 విలీన గ్రామాలు, 7 ఆర్ అండ్ ఆర్ గ్రామాల ను కలుపుకొని మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేశామని తెలిపారు.
మాస్టర్ ప్లాన్ అనేది VTDA అభివృద్ధికి కీలకమైనదని, లైన్ డిపార్ట్మెంట్ లు, ngo లు, ప్రజా ప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలను క్రోడీకరించి వచ్చే 40 ఏండ్ల ప్రజా అవసరాలు, అభివృద్ధి నీ, భవిష్యత్తు తరాలకు ఉపయోపడేలా, పట్టణ సమగ్ర అభివృద్ధి సాధించేలా మాస్టర్ ప్లాన్ లో అన్ని అంశాలను పొందుపరచామన్నారు.

మాస్టర్ ప్లాన్ పై అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునేందుకు, VTDA పరిధిలోకి వచ్చే వివిధ వర్గాలు, భాగస్వాములతో విస్తృతంగా చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సమావేశంలో వచ్చే సూచనలు, సలహాలు, అభ్యంతరాలపై మరోసారి చర్చించి సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని అన్నారు.

ఈ సమావేశంలో పలువురు ప్రజా ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

తమకు మాస్టర్ ప్లాన్ ను అర్థం అయ్యేలా తమకు విడమరిచి చెప్పాలన్నారు .

వేములవాడ కు ఉన్న చారిత్రక ప్రత్యేకతను… పర్యావరణ, పురావస్తు అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.

జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్ మాట్లాడుతూ…
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఏమైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే లిఖిత పూర్వకంగా ఇవ్వాలన్నారు.

ఈసమావేశంలో టౌన్ ప్లానింగ్ శాఖ ముఖ్య ప్రణాళిక అధికారి అధికారి చంద్రిక మాస్టర్ ప్లాన్ లో
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా గ్రోత్ కారిడార్లు, ఇండస్ట్రియల్ జోన్ల ఏర్పాటు వంటి అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

సమావేశంలో వేములవాడ మున్సిపాలిటీ చైర్మన్ మాధవి, టౌన్ ప్లానింగ్ డీడీ జగన్ మోహన్, ఎంపీపీ బి వజ్రమ్మ, zptc మ్యాకల రవి, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

—————————–

Share This Post