భవిష్యత్ అవసరాల కనుగుణంగా నర్సరీలను ఎక్కువ విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.

ప్రచురణార్ధం

సెప్టెంబరు 29 ఖమ్మం:

భవిష్యత్ అవసరాల కనుగుణంగా నర్సరీలను ఎక్కువ విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలో బుధవారం జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించి పలు పనులను తణిఖీ చేసారు. కూసుమంచి మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనాన్ని, నర్సరీను అదేవిధంగా నాయకన్ గూడెం లోని బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని కలెక్టర్ తణిఖీ చేసారు. కూసుమంచి పల్లె ప్రకృతి వనం నిర్వహణ చాలాబాగుందని కలెక్టర్ తెలిపారు. పల్లె ప్రకృతి వనంలోనే నిర్వహిస్తున్న నర్సరీ విస్తీర్ణాన్ని మరింత పెంచాలని, దీనితో పాటు మరో ప్రదేశంలో నర్సరీను ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 50 రకాల 4 వేల మొక్కలతో సుందరంగా, ఆకర్షణీయంగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనాన్ని ఇదేవిధంగా సక్రమంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం నర్సరీను కలెక్టర్ సందర్శించి ఏ. ఏ మొక్కలు పెంచుతున్నారని వససేవకులను అడిగి తెలుసుకున్నారు. టేకు, | గుల్మోహర్, గంగరావి, లెమన్ గ్రాస్, చింత, గోరింటాకు, మందారం, ఖర్జూర వివిధ రకాల పూల మొక్కలను నర్సరీలలో పెంచుతున్నట్లు వనసేవకులు తెలిపారు. వనసేవకులకు చెల్లింపులు ఎప్పటివరకు జరిగాయాని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా నర్సరీ, పల్లె ప్రకృతివనం యొక్క నీటివసతి పట్ల కలెక్టర్ తెలుసుకున్నారు. అనంతరం నాయకన్ గూడెం ఎన్.ఎస్.పి. స్థలంలో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని కలెక్టర్ సందర్శించారు. ఇప్పటికే 27 రకాల 5 వేల వివిధ మొక్కలను నాటినట్లు గ్రామ సర్పంచ్, సంబంధిత అధికారులు వివరించారు. బృహత్ పల్లె ప్రకృతి వనంలో, పార్క్ ఏర్పాటు చేయాలని, ప్రజలకు, చిన్నారులకు అవసరమైన కనీస వసతులు సమకూర్చాలని, ఫెన్సింగ్ ప్రహరీ ఏర్పాటు చేయాలని, మిగిలిన మొక్కలు నాటే పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా కూసుమంచి మండల కేంద్రంలో అటవీ శాఖ ద్వారా జరుగుచున్న ఎవెన్యూ ప్లాంటేషన్ను కలెక్టర్ తణిఖీ చేసారు. రోడ్డు కిరువైపుల పెద్ద మొక్కలను నాటి, రక్షణ వలయాలను ఏర్పాటు చేయాలని, గ్రామ పంచాయితీ ద్వారా ప్రతి వారం మొక్కలకు నీటిని అందించాలని కలెక్టర్ సూచించారు.

జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన, ఎం.పి.డి.ఓ. జి. కరుణాకర్ రెడ్డి, ఎఫ్.డి.ఓ ప్రకాష్, కూసుమంచి, నాయకన్ గూడెం సర్పంచ్లు సి.హెచ్.మోహన్ రావు, కాసాని సైదులు, ఎం.పి.ఓ. రాంచదర్ రావు, గ్రామ కార్యదర్శి నరేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post