భవిష్యత్ కొరకే బృహత్ వనాలు… రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళా, శిశు సంక్షేమ శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్

ప్రచురణార్థం

భవిష్యత్ కొరకే బృహత్ వనాలు…

బయ్యారం
మహబూబాబాద్, జూలై-24:

రాబోయే తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ప్రభుత్వం ముందుచూపుగా బృహత్ వనాల కార్యక్రమం చేపట్టిందని రాష్ట్ర గిరిజన సంక్షేమం మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్ వెల్లడించారు.

శనివారం బయ్యారం మండలం రామచంద్రపురం గ్రామపంచాయతీ పరిధిలోని చింతోని గుంపు అటవీ క్షేత్రంలో జిల్లా అటవీ శాఖ అధికారి రవికిరణ్ ఆధ్వర్యంలో మంత్రి జడ్పీ చైర్మన్ బిందు, ఎంపీ కవిత, జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, ఇల్లందు శాసనసభ్యురాలు హరిప్రియ లు కలిసి తెలంగాణ హరితహారంలో భాగంగా రాష్ట్ర ఐ.టి., మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినోత్సవం పురస్కరించుకొని మూడుకోట్ల వృక్షార్చనలో పాల్గొని మొక్కలు నాటారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ అడవులు 33 శాతం ఉండాలని 23 శాతంకు తరిగిపోయి అంతరించిపోతున్న క్రమంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం, వాతావరణం సమతుల్యత లోపించడం వంటి పలు సమస్యలు ఉత్పన్నం కావడంతో అడవులను కాపాడుకోవాలన్న సదుద్దేశంతో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటివరకు ఆరు విడతలుగా చేపట్టడం జరిగిందని ఏడో విడత గా హరితహారం కార్యక్రమాన్ని మరింతగా విస్తరింపజేసేందుకు బృహత్ పల్లె ప్రకృతి వనాలను చేపట్టడం జరిగిందన్నారు. అటవీశాఖ అధికారులు పర్యవేక్షిస్తూ సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. నీటి వసతి కల్పించేందుకు వైకుంఠధామంలో బోరు మంజూరుకు ప్రతిపాదనలు అందించాలన్నారు. ఫారెస్ట్ రెవెన్యూ అభ్యంతరాలతో ఉన్న 16 వేల ఎకరాలలో ఆరు వేల ఎకరాలు రెవెన్యూ భూమి గా నిర్ధారించడం జరిగిందని త్వరితగతిన చర్యలు తీసుకుంటామన్నారు ఈ ప్రాంతంలో బయ్యారం ఉక్కు పరిశ్రమ నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటామని తద్వారా యువతకు శాశ్వత ఉపాధి లభిస్తుందన్నారు గార్ల బయ్యారం మండలాల్లోని ఆయకట్టుకు నీరందించాలని సంకల్పంతో సీతారామ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగిందన్నారు గార్ల మండలం రాంపురం వద్ద మున్నేరు పై బ్రిడ్జి నిర్మాణం చేపడతామన్నారు.కొత్తపేట అభివృద్ధికి 10 లక్షలు మంజూరు చేశామని సత్యనారాయణపురం సబ్స్టేషన్ నిర్మాణంలో భూమి కోల్పోయిన నిర్వాసితులకు ఉపాధి కల్పిస్తామన్నారు అలాగే సత్యనారాయణపురం గ్రామాభివృద్ధికి 10 లక్షలు బయ్యారం ఓపెన్ జిమ్ కు మరో పది లక్షలు మంజూరు చేసినట్లు తెలియజేశారు.

జడ్పీ చైర్మన్ కుమారి బిందు మాట్లాడుతూ హరితహారం పట్ల ప్రజల్లో చైతన్యం వచ్చిందని అవగాహన కూడా పెరిగింది అన్నారు ట్రీ గార్డ్స్ లేకపోయినా కట్టెలతో ఫెన్సింగ్ కట్టడం ఇందుకు నిదర్శనమన్నారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిలో ఉందన్నారు.

పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నే హరితహారం కార్యక్రమానికి ప్రాధాన్యత పెరిగింది అన్నారు రోడ్ల వెంట పిచ్చి చెట్లు ఉండేవని ఈనాడు హరిత హారంలో వాటిని తొలగిస్తూ మొక్కలు నాటడం రోడ్డు అందంగా కనిపిస్తున్నాయన్నారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి పిలుపుమేరకు ఎనిమిది ఎకరాల్లో ఎనిమిది వేల మొక్కలు నాటడం జరుగుతున్నదని అన్నారు.

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ జిల్లాలోని 16 మండలాలలో అంచలంచలుగా బృహత్ పల్లె ప్రకృతి వనాలు చేపడతామన్నారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్వహణ చేపడతామన్నారు బృహత్ పల్లె ప్రకృతి వనాలు పార్కులు గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

జిల్లా అటవీ శాఖ అధికారి రవి కిరణ్ మాట్లాడుతూ బృహత్ పల్లె ప్రకృతి వనాలు అటవీ క్షేత్రంలో చేపడుతున్నందున వాతావరణం తగినట్లుగా అడవికి సంబంధించిన కుంకుడు గచ్చకాయ ఎదురు తునికి నేరేడు వంటి మొక్కలు మాత్రమే నాటడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పి సీఈఓ అప్పారావు, డిఆర్డీఏ పి.డి.సన్యాసయ్య, తహసీల్దార్ నాగ భవాని, ఎంపిడిఓ చలపతిరావు, ఎంపిఓ పద్మ,గార్ల జడ్పిటిసి, గ్రామ సర్పంచ్ పోలేబోయిన వెంకటేశ్వర్లు, ఎంపిటిసి గట్ల లక్ష్మీ, గ్రామ ఉప సర్పంచ్ తొట్టి కరుణ తదితరులు పాల్గొన్నారు.
——————————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది.

Share This Post