భవిష్యత్ తరానికి బంగారు బాటలు వేసేందుకు కులమతాలకతీతంగా అభివృద్ధికి కృషి చేద్దాం

భవిష్యత్ తరానికి బంగారు బాటలు వేసేందుకు కులమతాలకతీతంగా అభివృద్ధికి కృషి చేద్దాం

  • శాంతిభద్రతలు ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి
  • అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అనే ఆలోచన విధానం తో ముందుకు వెళ్లాలి
  • రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

::::000000000:::::::::

     భవిష్యత్ తరానికి బంగారు బాటలు వేసేందుకు ప్రతి ఒక్కరు కులమతాలకు అతీతంగా జిల్లా రాష్ట్ర దేశాభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర బీసీ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

     సోమవారం సాయంత్రం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున  ఆధ్వర్యంలో నిర్వహించిన  ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు అందరూ కఠోర  ఉపవాసాలు ఉంటారని అన్నారు. ఉపవాస దీక్షలో లోకమంతట అందరూ చల్లగా ఉండాలని అల్లాను ప్రార్థించాలి అన్నారు. జిల్లా రాష్ట్ర దేశ అభివృద్ధికి హిందూ, ముస్లిం, క్రిస్టియన్,సిక్కులు అందరూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే సంకల్పంతో మతసామరస్యం తో ముందుకు వెళ్లాలన్నారు. జిల్లా అభివృద్ధికి కులమతాలకు అతీతంగా భవిష్యత్ తరానికి బంగారు బాటలు వేయాలన్నారు.

     కలెక్టర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల పండుగలను అధికారికంగా నిర్వహిస్తోందన్నారు.  ముస్లిం సోదరులకు రంజాన్ మాసంలో నూతన వస్త్రాలను అందిస్తుందన్నారు. జిల్లాకు గిఫ్ట్ ప్యాకెట్లు కోసం 15 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు  ఈ నెల 28, 29 తేదీల్లో జిల్లాలో గిఫ్ట్ ప్యాకెట్లను అందించనున్నా మని, ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ముస్లిం సోదరులకు అడ్వాన్స్ ఈద్ ముబారక్ కలెక్టర్ తెలిపారు.

     ఈ సందర్భంగా షోయబ్ లతీఫ్ మంత్రి గంగుల కమలాకర్ కు, నగర మేయర్ వై సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ కు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల  విజయకు పవిత్ర ఖురాన్ ను బహూకరించారు.

     ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మధుసూదన్, తహసిల్దార్ సుధాకర్, నగర మాజీ మేయర్ అబ్బాస్ సమి, కార్పొరేటర్లు, షోయబ్ లతీఫీ, ముస్లిం మత పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల అధికారి , కరీంనగర్ చే జారీ చేయబడినది.

Share This Post