భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగను జరుపుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ఆడపడుచులకు ముందస్తుగానే బతుకమ్మ చీరెలు పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.

ప్రచురణార్ధం

అక్టోబరు-03,ఖమ్మ:

భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగను జరుపుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ఆడపడుచులకు ముందస్తుగానే బతుకమ్మ చీరెలు పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఆదివారం రఘునాథపాలెం మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ కలిసి మహిళలకు చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని మతాల వారు హిందు, ముస్లిం, క్రిస్టియన్ వారు జరుపుకునే దసర, రంజాన్, క్రిస్టమస్, పండుగల సందర్భాలో వారికి ఉచితంగా దుస్తులు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. బతుకమ్మ పండుగకు మన రాష్ట్ర: ముఖ్యమంత్రి గారు ఆడపడుచులు కొత్త చీరెలు కట్టుకొని సంస్కృతి సంప్రదాయాలతో బతుకమ్మ ఆట, పాటలతో 9 రోజుల పాటు సంతోషంగా ఆడాలని మంత్రి తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకొరకు వినూత్న కార్యక్రమాలు చేపడుతుందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింభించే విధంగా అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం కల్పిస్తుందని తెలిపారు. తెలంగాణ ఆడపడుచుల కొరకు ప్రత్యేకంగా సిరిసిల్లా నేత కార్మికులతో రంగురంగుల చీరెలను వేయించడం జరిగిందని, కార్యక్రమం వల్ల వారికి కూడా జీవనోపాధి కల్పించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ సందర్భంగా జిల్లాలోని ఆడపడుచులకు పంపిణీ చేసేందుకు. జిల్లాకు 16 రంగులు కలిగిన 4 లక్షల 27 వేల చీరెలు జిల్లా కేంద్రానికి వచ్చాయని, రఘునాథపాలెం. మండలంలో 16 వేల చీరెలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఆయా తేదిలలో ఎంపిక చేసిన ప్రదేశాలలో చీరెలు పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన, రఘునాథపలెం ఎం.పి.పి. భూక్యా గౌరీ, సర్పంచ్ గుడిపూడి శారద, తహశీల్దారు నర్సింహారావు, ఎం.పి.డి.ఓ. రామకృష్ణ. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share This Post