పత్రికా ప్రకటన తేది: 07-08-20 21
భారతదేశం లోనే జోగులాంబ గద్వాల జిల్లా చేనేత చీరలకు ప్రత్యేక గుర్తింపు ఉందని జిల్లా కలెక్టర్ శృతి ఓజా అన్నారు.
శనివారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని కృష్ణవేణి చౌరస్తా లో చేనేత జౌళి శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత ర్యాలి ని జెండా ఊపి ప్రారంభించి చేనేత కార్మికులతో కలిసి జిల్లా కలెక్టర్ శృతి ఓజా , జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య పాతబస్టాండ్ మీదుగా బాల భవన్ వరకు ర్యాలిలో పాల్గొన్నారు. బాల భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశం లో ఆమె మాట్లాడుతూ చేనేత వారసత్వ సంపదను కాపాడుకోవాలని, చేనేత కార్మికులకు వచ్చే అన్ని సంక్షేమ పథకాలను మరియు అభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చేనేత వస్త్రాల వల్ల ఆరోగ్యం వస్తుందని, చర్మ వ్యాధులు రావని, అంతేకాక శరీరాన్ని చల్లగా ఉంచుతాయని అందువల్ల ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి చేనేత రంగాన్ని,కార్మికులను కాపాడాలని, చేనేతలకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. చేనేత పరిశ్రమ పై ఆధారపడిన వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రారంభించిందని, ఇంకా ముందు ముందు చేనేత కార్మికులను ఆదుకోవడానికి అన్ని రకాల సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. మీ అందరి కృషి వల్లే చేనేత చీరలకు మంచి పేరు వచ్చిందని, జిల్లా లోని నేతన్నలకు అన్ని రకాలుగా ప్రోత్సాహం అందించి ముందుకు తీసుకెళ్ళేవిదంగా కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు చేనేత వస్త్రాలు ధరించాలని కోరుతూ కార్యక్రమానికి హాజరైన వారితో ప్రతిజ్ఞ చేయించారు .
జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య మాట్లాడుతూ చేనేత అందాలు మన సంస్కృతికి చిహ్నాలు , జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఆగష్టు 7న దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారని, భారత స్వాతంత్ర్యోద్యమములో ప్రధాన భూమిక పోషించి, జాతీయ చేనేత దినోత్సవం స్వాతంత్య్ర సమపార్జనకు ఒక సాధనంగా చేనేత నిలిచిందని అన్నారు. చేనేత కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా ఉంటుందన్నారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నేతన్నకు చేయూత పథకం తీసుకువస్తుందని తెలిపారు. తదనంతరం చేనేత వృత్తి లో నైపుణ్యం కలిగిన చేనేత కార్మికులకు ప్రశంసా పత్రాలతో పాటు , మొమెంటో శాలువా ల తో సన్మానించారు. వ్యాస రచన పోటీలలో విజేతలైన విద్యార్థులకు ప్రశంసా పత్రం, మొమెంటో లతో సత్కరించారు. ఐ జ చేనేత సహకార సంఘానికి రూ. 24.7 6 లక్షల పావలా వడ్డీ డమ్మీ చెక్కును అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత మరియు జౌళి శాఖ ఎ.డి గోవింద్ నాయక్, జాడ్పి కో- ఆప్షన్ సభ్యులు నిషాక్, డి.ఆర్.డి.ఓ. ఉమాదేవి, డి ఎస్ ఓ రేవతి, డి పి ఆర్ ఓ చెన్నమ్మ,చేనేత అభివృది అధికారులు , జిల్లా అధికారులు, కౌన్సిలర్ శ్రీమన్నారాయణ, చేనేత కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
————————————————————————————————————-
జిల్లా పౌర సంబందాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి ద్వారా జారి చేయబడినది.



