భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రధానమైన చిహ్నాలలో చేనేత రంగం ఒకటని, చేనేత వారసత్వాన్ని కాపాడుకొనుటకు, కార్మికులను శక్తివంతం చేయడం కొరకు భావి తరం విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు

భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రధానమైన చిహ్నాలలో చేనేత రంగం ఒకటని, చేనేత వారసత్వాన్ని కాపాడుకొనుటకు,  కార్మికులను శక్తివంతం చేయడం కొరకు భావి తరం  విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా  మంగళవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్ లో చేనేత శాఖ ఇంచార్జి ఏ.డి. గోవిందయ్య, బి.సి. సంక్షేమ శాఖ జిలా అధికారి అనిల్ ప్రకాష్, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ, జిల్లా సైన్స్ అధికారి కృషా రెడ్డి కలిసి ఏర్పాట్ల పై చర్చించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ   జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని భావి తరాలైన విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా  జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్న 8, 9,10వ తరగతి విద్యార్థులు,  ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు వ్యాసరచన , ఉపన్యాస పోటీలు నిర్వహించాలని  ఆదేశించారు.   అదేవిధంగా చేనేత వస్త్రాలను ధరించిన విద్యార్థులకు అలంకరణ పోటీలు నిర్వహించాల్సిందిగా  సూచించారు.  ప్రతి  పాఠశాల నుండి, ప్రతి కళాశాల నుండి  ఒకరు చొప్పున   అలంకరణ పోటీలో పాల్గొనేవిధంగా చూడాలని తెలియజేసారు. ఈ పోటీలు 06.08.2022 ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నాగర్ కర్నూల్ నందు నిర్వహించాల్సిందిగా అదేశించారు.  ఆగస్టు 7వ తేదీ ఉదయము ఉదయం 9:30 గంటలకు పాఠశాల విద్యార్థులు, కళాశాల విద్యార్థులచే ర్యాలీ నిర్వహించాలని,  ఈ ర్యాలీ కలెక్టరేట్ నుండి గాంధీ విగ్రహం వరకు ఉండేవిధంగా చూడాలన్నారు.  అనంతరం గెలిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు,  మెమొంటోలు ఇచ్చేవిధంగా ఏర్పాట్లు చేయాలన్నారు.  విద్యార్థులకు లేదా పాఠశాల ఉపాద్యాయులకు ఏమైనా సందేహాలు ఉంటే  జిల్లా వెనుకబడిన తరగతుల  సంక్షేమ అధికారి అనిల్ కుమార్ (8008099442) లేదా జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి (9989921105)ని సంప్రదించవచ్చన్నారు.

Share This Post