భారత్ మాల జాతీయ రహదారి కోసం కేటి దొడ్డి, గట్టు మండలాలలోని పలు గ్రామాలలో అధికారులు గ్రామ సభలునిర్వహించి, భూములు కోల్పోయిన రైతుల అభిప్రాయం తీసుకోవాలని, అన్ని గ్రామాలలో గ్రామ సభను ఏర్పాటు చేసి గ్రామాల సర్పంచులు, రైతులు , ప్రజల మధ్య సమావేశాలు నిర్వహించాలని రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ భారత్ మాల నిర్మాణం పనులు చేపట్టాలని స్తానిక శాశనసభ్యులు కృష్ణ మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అధికారులకు సూచించారు.

మంగళవారం కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు బారత్  మల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ జిల్లా లో    కేటిదొడ్డి, గట్టు మండలాలల్లో నూతనముగా నిర్మాణం  చేపడుతున్న  భారత్ మాల ప్రాజెక్ట్ కింద  నిర్మాణ పనులను  అధికారులు తో  రోడ్డు నిర్మాణంలో   రైతులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి వ్యవసాయం కు  వెళ్లే దారిని కూడా ఏర్పాటు చేసి రైతులకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా  ఈ భారత్ మాల రోడ్డు నిర్మాణము  చేయాలనీ అన్నారు.

నేషనల్  హై వే భారత్ మాల ప్రాజెక్ట్ లో భాగంగా  జాతీయ రహదారుల నిర్మాణం కొరకు భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లిస్తుందని జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు.

జాతీయ రహదారి జోగులాంబ గద్వాల జిల్లా లోని కేటి దొడ్డి మండలం నందిన్నె గ్రామం  నుండి వడ్డేపల్లి మండలం బుడమర్సు, రాజోలి వరకు    6 మండలాలలో 19 గ్రామాల పరిధిలో 52 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణానికై భూసేకరణలో భూమి నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం  చెల్లిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

సమావేశం లో డి జి ఎం సరస్వతి,  ప్రాజెక్ట్ మేనేజర్ వినోద్ కుమార్,  ఎంపీపీలు విజయ కుమార్ , మనోరమ్మ, జెడ్పీటీసీలు రాజశేఖర్ బాసు శ్యామల, వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు,  సర్పంచ్ ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

——————————————————————————————

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చే  జారీ చేయబడినది.

Share This Post