బుధవారం నాడు కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ఎలక్టోరోల్ పరిశీలకులు, ERO తో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎలక్టోరోల్ పరిశీలకులు శ్రీమతి బి. బాల మాయ దేవి మాట్లాడుతూ, ఎలాంటి ఆక్షేపణలు లేని ఓటర్ జాబితాను సిద్ధం చేసి ప్రచురించడం జరుగుచున్నదని తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని 104- పరకాల,105- వరంగల్ వెస్ట్ నియోజక వర్గాల పరిధిలో మొత్తం 479 పోలింగ్ కేంద్రాలలో 4,78,403 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఇందులో 2,36,815 పురుషులు, 2,41,360 మంది స్త్రీలు, 15 థర్డ్ జెండర్, ఎన్ ఆర్ ఐ 81, సర్వీసెస్ 209 ఓటర్లు ఉన్నట్లు తెలిపారు.
పరకాల నియోజక వర్గంలో 238 పోలింగ్ కేంద్రాల పరిధిలో 206538 మంది ఓటర్లు కాగా 101396 మంది పురుషులు, 1,04995 మంది స్త్రీలు, 3 థర్డ్ జెండర్, ఎన్ ఆర్ ఐ 3, సర్వీసెస్ 144 ఓటర్లు ఉన్నట్లు తెలిపారు.
వరంగల్ వెస్ట్ నియోజక వర్గంలో 241 పోలింగ్ కేంద్రాల పరిధిలో 271865 మంది ఓటర్లు కాగా 135419మంది పురుషులు, 136365 మంది స్త్రీలు, 12 థర్డ్ జెండర్, ఎన్ ఆర్ ఐ 78, సర్వీసెస్ 69 ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. 479 పోలింగ్ కేంద్రాల పరిధిలో 6046 దరఖాస్తు రాగా 5608 ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పరిష్కరించడం జరిగిందని తెలిపారు. 18 సంవత్సరాల వయస్సు నిండిన నూతనంగా 3406 (పరకాల 1788, వరంగల్ వెస్ట్ 1618) యువతి, యువకులు ఓటరు గా నమోదు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారంగా 479 పోలింగ్ కేంద్రాలలో తుది ఓటర్ల జాబితాను ప్రకటించడం జరిగిందని తెలిపారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశము నిర్వహించి హనుమకొండ జిల్లా ఓటర్ల తుది జాబితా విడుదల పై చర్చించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి ఆర్ డి ఓ వాసుచంద్ర , ఈవి శ్రీనివాసరావు (కాంగ్రెస్ పార్టి), అశోక్ కుమార్(బీజేపీ), ఈ. నాగేశ్వరరావు(టిఆర్ఎస్), ఏ. స్టెఫీన్(బీఎస్పీ), ప్రభాకర్ రెడ్డి (సిపిఏం), కె. శ్యామ్ సుందర్(టిడిపి), రాజినికాంత్(వైఎస్ ఆర్ సిపి), జిల్లా ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు రాణి, డిటి రామారావు పాల్గొన్నారు.