భారత ఎన్నికల కమీషన్ ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక అంశంతో వినూత్న కార్యక్రమాలుస్థానిక- సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

భారత ఎన్నికల కమీషన్ ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక అంశంతో వినూత్న కార్యక్రమాలుస్థానిక- సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

ఓటర్లలలో అవగాహాన పెంపొందించుటకు భారత ఎన్నికల కమీషన్ ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక అంశంతో వినూత్న కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొనుటకు పలు సౌకర్యాలు కల్పిస్తున్నదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. ఈ సంవత్సరం ఎన్నికల కమీషన్ అందరి భాగస్వామ్యంతో అందరిని కలుపుకొని ఎన్నికలు నిర్వహించాలనే అంశంతో వికలాంగులు, వృద్దులు, లింగమార్పిడి, అట్టడుగు వర్గాలకి ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యులను చేస్తున్నదని అన్నారు. 12 వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఏ ఒక్క ఓటరు నమోదు కాకుండా ఉండిపోకూడదన్న ఉద్దేశంతో ఎన్నికల కమీషన్ ఏటా జాతీయ ఓటరు దినోత్సవాన్ని 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువత ఓటరుగా నమోదు చేయడంతో పాటు ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొనేలా, దేశ పౌరునిగా బాధ్యతతో ఓటు వేసేలా అవగాహన కల్పిస్తున్నది అన్నారు. ఎన్నికల కమీషన్ తీసుకుంటున్న వినూత్న నిర్ణయాల వళ్ళ ప్రజలలో చైతన్యం వస్తున్నదని ఇటీవల గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాలలో కూడా ఓటు శాతం పెరుగుతున్నదని అన్నారు. స్వీప్ ద్వారా నిర్వహిస్తున్న పలు చైతన్య కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయని మన జిల్లాలో 1,938 మంది కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్నారని అన్నారు. ప్రధానంగా మన జిల్లాలో ఓటరు హెల్ప్ లైన్ యాప్ ను బాగా ఉపయోగించుకున్నారని, ఇటీవల జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ , రోల్ పరిశీలకులు శైలజా రామయ్యర్ ప్రసంశించారని అన్నారు. గతంలో ఎన్నికల సమయంలోనే ఓటరు నమోదు కొనసాగేది కానీ నేడు నిరంతరంగా నమోదు కార్యక్రమం జరుగుతున్నదని, డిజిటల్ టెక్నలాజి వచ్చిన తరువాత మొబైల్ లోనే ఓటరు నమోదు, నియోజక వర్గం మార్పు వంటివి చేసుకునే అవకాశమొచ్చినదని, యువత ఈ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశ భవిష్యత్తును, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ఓటు అని, నూతనంగా ఓటరుగా నమోదైన యువత ఓటు హక్కును గర్వంగా భావించి బాధ్యాతాయుతంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొని విజ్ఞతతో మంచి నాయకున్ని ఎన్నుకోవాలని సూచించారు.
అదనపు కలెక్టర్ రమేష్ మాట్లాడుతూ లిటరసి క్లబ్బుల ద్వారా కళాశాల, పాఠశాల స్థాయిలో చైతన్య కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పట్టాన ప్రాంతాలలో నమోదు పెరగడంతో పాటు ఓటింగ్ శాతం కూడా పెరిగిందని అన్నారు. 80 శాతం పైగా ఓటింగు జరిగితేనే సమర్థవంతమైన ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లని, ఆ దిశగా ప్రతి ఒక్కరు భాద్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
ఈ సంధర్భంగా ఓటర్లను చైతన్య పరచండంలో, ఓటరు నమోదు, ఎన్నికల ప్రక్రియలో ఉత్తమ సేవలందినించిన పలువురికి అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, రమేష్ లు ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రశంసాపత్రాలు అందుకున్న వారి వివరాలు… ఉత్తమ ఎలక్టోరల్ లిటరసీ క్లబు గా మాక్ పోల్ నిర్వహించి అవగాహన కలిగించినందుకు గాను నిజాంపేట్ జెడ్.పి .హెచ్.ఎస్., ఉత్తమ క్యాంపస్ అంబాసిడర్ గా ,నరసాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ దశమ్మ, విద్యార్థి సుప్రియ, కొల్చారం జూనియర్ కళాళాశాల లెక్చరర్ గంగ, విద్యార్థి రోజా, వంద మంది ఓటర్లను నమోదు చేసినందుకు గాను నరసాపూర్ బి.వి.ఆర్.ఐ.టి. కళాశాలకు ఉత్తమ ఓటరు చైతన్య ఫోరమ్ గా ప్రశంసా పత్రాలు అందజేశారు. అదేవిధంగా ఓటరు చైతన్య కార్యక్రమలు నిర్వహించినందుకు గాను స్వీప్ నోడల్ అధికారి రాజి రెడ్డి, ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొన్న ఉప తహశీల్ధార్ నాగవర్ధన్, ప్రసాద్ , ఈడియెమ్ సందీప్, నరేష్, రవి, రాజ్ కిరణ్, రాజ్ కుమార్, రవీందర్ లతో పాటు ఉత్తమ బ్లాక్ స్థాయి అధికారులైన నాగలక్ష్మి, అరుణ లకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
అంతకు ముందు జాతి, కుల,మత, భాష , ఇతర ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రజాస్వామ్యం పై విశ్వాసంతో ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని అదనపు కలెక్టర్ అందరిచే ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం నూతన ఓటరుదారులకు ఫోటో ఎపిక్ కార్డు కిట్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్, డి.ఈ.ఓ. రమేష్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి పరశురామ్ నాయక్, ఎలక్షన్ సూపరింటెండెంట్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post