భారత దేశానికి స్వాతంత్ర్యము వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా కేంద్ర ప్రభుత్వము జల వనరుల శాఖ వారు దేశం లో ఉన్న నదుల ఉత్సవాలు జరుపుతున్నారని జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ తెలిపారు.

పత్రికా ప్రకటన                                                        తేది:10-12-2021

భారత దేశానికి స్వాతంత్ర్యము వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా కేంద్ర ప్రభుత్వము జల వనరుల శాఖ వారు దేశం లో ఉన్న నదుల ఉత్సవాలు జరుపుతున్నారని  జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ తెలిపారు.

శుక్రవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశం లో ఉన్న నదుల ఉత్సవాలు జరుపుతున్న సందర్బంగా జోగులాంబ గద్వాల జిల్లా కృష్ణ నది తీరంలో  ఉండటం వలన కొన్ని మార్గదర్శకాలు పాటిస్తూ జిల్లాలో వివిధ కార్యక్రమాలు జరపాలని అధికారులకు తెలిపారు. నదుల ఉత్సవ ముఖ్య ఉద్దేశాలు, మరియు వివిధ జిల్లా అధికారులు , డి.ఈ.ఓ ,  డి.ఆర్.డి.ఓ , పి.డి., ఆర్.డి.ఓ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్స్, మరియు మున్సిపల్ కమీషనర్లు, చేపట్టవలసిన కార్యక్రమాలను కూలంకుషంగా వివరించారు. కేంద్ర ప్రబుత్వ సూచనల మేరకు , వాటికి  అనుగుణంగా ఈ నెల 17 వ తేది నుండి 23 వ తేది వరకు నదుల శుద్ధీకరణ, నదుల పరిసర ప్రాంతాలలో పరిశుబ్రంగా ఉంచాలని, నది హారతి కార్యక్రమం ఆలంపూర్ లో నిర్వహించబడునని, అధికారులందరు సమన్వయము తో నదుల ఉత్సవాలను జయప్రదము చేయాలనీ అధికారులకు ఆదేశించారు.

సమావేశం లో డి.ఆర్.డి.ఓ ఉమాదేవి, డి.పి.ఓ శ్యాం సుందర్, ఎం.పి రమేష్ బాబు,  ప్రియదర్శిని మరియు ఎం.ఎ.ఎల్.డి కళాశాల ప్రిన్సిపల్స్, ఆలంపూర్, గద్వాల్ మున్సిపల్ కమీషనర్ లు, జిల్లా ఇరిగేషన్ అధికారి,  ఇ.ఓ.జోగులాంబ వీరేశం, సుపరిటెన్డెంట్ మదన్ మోహన్, తదితరులు, పాల్గొన్నారు.

—————————————————————————–

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల  గారి చే  జారీ చేయబడినది.

Share This Post