భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పండగ వాతావరణం లో ఘనంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించుటకు పూర్తి ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, ఎస్ పి రంజన్ రతన్ కుమార్ అధికారులకు ఆదేశించారు.

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పండగ వాతావరణం లో ఘనంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించుటకు పూర్తి  ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, ఎస్ పి రంజన్ రతన్ కుమార్  అధికారులకు ఆదేశించారు.

సోమవారం కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు ఎస్ పి రంజన్ రతన్ కుమార్ తో కలిసి ఎం పి డి ఓ లు, జిల్లా అధికారులు,తహసిల్దర్లతో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. అన్ని గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలలో నిర్దేశిత కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.. ఈ నెల 09 న ఉదయం 10 . 30 గంటలకు జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని కానున్న జిల్లా స్థాయి వజ్రోత్సవ వేడుకలను ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మున్సిపల్ ఛైర్పర్సన్ లు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జెడ్పిటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లను ఆహ్వానించాలని, మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులందరూ విధిగా పాల్గొనాలని సూచించారు. ప్రారంభోత్సవ సమావేశంలో త్రివర్ణ పతాకాలను అందించడం జరుగుతుందని, వీటిని ఈ నెల 12 వ తేదీ సాయంత్రం లోపు ఎంపీడీవోలు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీల కార్యదర్శులు జాతీయ పతాకాలను స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఇంటింటికి పంపిణి చేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు. ప్రతిచోటా ఫ్లాగ్ కోడ్ పరిపూర్ణంగా అమలయ్యేలా చూడాలని, మువ్వన్నెల జెండా గౌరవానికి భంగం వాటిల్లకుండా ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. పంద్రాగస్టు రోజున ప్రజలందరూ తమతమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేసేలా క్షేత్ర స్థాయిలో కృషి చేయాలన్నారు. త్రివర్ణ పతాకం ఎగురవేసే విధానం గురించి తెలియజేయాలన్నారు. ప్రతి ఒక్కరు ఫ్లాగ్ కోడ్ అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జాగ్రత్తలు సూచించారు.

వేడుకల్లో భాగంగా 10 వ తేదీన వనమహోత్సవం జరపాలని, కనీసం 75 మొక్కలకు తగ్గకుండా నాటాలని, ఆ ప్రాంతానికి ఫ్రీడమ్ పార్కుగా వ్యవహరించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో, మున్సిపాలిటీల పరిధిలో, ప్రభుత్వ కార్యాలయాల్లో, ఇతర ఖాళీ ప్రదేశాల్లో అందుబాటులో ఉండే స్థలాన్ని అనుసరిస్తూ పెద్ద ఎత్తున అందమైన మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములు చేయాలని అన్నారు. 11 వ తేదీన అన్ని మండలాలు, మున్సిపాలిటీల స్థాయిలో ఫ్రీడమ్ ర్యాలీ జరపాలని, ఉదయం 6 . 30 గంటలకు ర్యాలీ ప్రారంభం కావాలని సూచించారు. 12 న జాతీయ సమైక్యతా రక్షా బంధన్ కార్యక్రమం చేపట్టాలని, 13 న ఎన్సీసీ, ఎన్ ఎస్ ఎస్, ఉద్యోగులు, ఉపాద్యాయులు, విద్యార్థులను ఎక్కువ సంఖ్యలో భాగస్వామ్యం చేస్తూ ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించేలా ర్యాలీలు జరపాలని, 14 న సాయంత్రం 5 . 00 గంటల నుండి రాత్రి 8 . 00 గంటల వరకు తెలంగాణ సాంస్కృతిక కళాకారులచే జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 15 వ తేదీన ఎప్పటిలాగే స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని, 16 న జిల్లా వ్యాప్తంగా ప్రతి చోటా ఒకే సమయంలో జాతీయ గీతాలాపన ఉంటుందని, అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా నిర్ణీత సమయంలో ఈ కార్యక్రమం జరగాలని కలెక్టర్ ఆదేశించారు. 17 న అన్ని నియోజకవర్గాల స్థాయిలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని, 18 న ఉద్యోగులు, యువతకు ఫ్రీడమ్ కప్ క్రీడా పోటీలు జిల్లా స్థాయిలో  చేపట్టాలని సూచించారు. అంతకు ముందే మండల స్థాయిలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాడ్మింటన్ అంశాల్లో పోటీలు నిర్వహించాలని, నియోజకవర్గ స్థాయిలో క్రికెట్ పోటీలు నిర్వహించాలని ,19 న ఆసుపత్రులు, అనాధ, వృద్దాశ్రమాలు, జైళ్లలో పండ్ల పంపిణి చేపట్టాలని, 20 న అన్ని గ్రామ పంచాయతీలు, వార్డులలో రంగోలీ పోటీలు నిర్వహించాలని సూచించారు. 21 న అన్ని స్థాయిలలో ప్రజలు, ప్రజా ప్రతినిధులను భాగస్వాములు చేస్తూ సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన ఐదవ తరగతి నుండి 10 వ తరగతి విద్యార్థులందరికీ అన్ని సినిమా థియేటర్లలో ఈ నెల 9 వ తేదీ నుండి ఉదయం 10 . 00 గంటల నుండి మధ్యాహ్నం 1 . 15 గంటల వరకు ‘గాంధీ’ మూవీని ఉచితంగా ప్రదర్శించనున్న సమయం లో విద్యార్థులకు  భద్రతకు ఎనలేని ప్రాధాన్యతనిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వజ్రోత్సవ వేడుకల శోభ ఉట్టిపడేలా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, అన్ని ముఖ్య కూడళ్లను అందంగా ముస్తాబు చేయాలని సూచించారు. జాతీయ నాయకుల విగ్రహాలను శుభ్రం చేయించి కొత్తగా రంగులు వేయించాలని అన్నారు. ఏ చిన్న పొరపాటుకు సైతం తావులేకుండా అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేస్తూ, పక్షం రోజుల పాటు కొనసాగనున్న వజ్రోత్సవ వేడుకలను పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యేలా అధికారులు, సిబ్బంది అందరూ అంకిత భావంతో కృషి చేయాలని సూచించారు.

సమావేశం లో  అడిషనల్ ఎస్ పి రాములు నాయక్, మున్సిపల్ కమిషనర్ లు, జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు  తదితరులు పాల్గొన్నారు.

——————————————————————————————–

జిల్లా పౌర సంబందాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి ద్వారా జారి చేయబడినది.

 

 

 

 

 

 

Share This Post