భారత ప్రభుత్వం సామాజిక భద్రత పథకం కింద అసంఘటిత కార్మికుల కోసం e-shram పోర్టల్ ను ప్రవేశ పెట్టిందని అదనపు కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు.

పత్రికా ప్రకటన                                                         తేది: 22-10-2021

భారత ప్రభుత్వం సామాజిక భద్రత పథకం కింద అసంఘటిత కార్మికుల కోసం  e-shram పోర్టల్ ను ప్రవేశ పెట్టిందని అదనపు కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు.

శుక్రవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు జిల్లాకార్మిక శాఖ  అధికారి మరియు మున్సిపల్ కమీషనర్లు, సంబంధిత బ్యాంకు మేనేజర్ లతో నిర్వహించిన సమావేశం లో మాట్లాడుతూ  e-shram పోర్టల్ లో  ఈ.ఎస్.ఐ సౌకర్యం లేని అసంఘటిత కార్మికులు ప్రోవిడెంట్ ఫండ్ విభాగం లో ఎలాంటి రుసుము లేకుండా కామన్ సర్వీస్ సెంటర్ లో నమోదు చేసుకోవాలని అన్నారు. ఉపాధి హామీ పనులు చేసే వారు, మత్స్యకారులు, వీధి వ్యాపారాలు చేసే వారంతా అసంఘటిత కార్మికుల జాబితా లోకి వస్తారని తెలిపారు.  నమోదు చేసుకున్న తరవాత కార్డు తీసుకున్న కార్మికులు ప్రమాదవశాత్తు మరణించినట్లయితే వారి కుటుంబం 2 లక్షలు ఆర్ధిక సహయాన్ని పొందుతారని, పాక్షికంగా అంగవైకల్యం కలిగితే ఒక లక్ష ఆర్ధిక సహాయాన్ని పొందుతారని తెలిపారు. ప్రధాన మంత్రి స్వానిది పథకం ద్వారా లోన్ పొంది ప్రతి నెల రెగ్యులర్ గా రికవరీ చేసిన వారు ఎ బ్యాంకు ల్లో ఎంత మంది ఉన్నారు, వారిని  గుర్తించి వారి నుంచి వివరాలను సేకరించి పోర్టల్ లో నమోదు చేయించాలని,  2 వ విడత లో లోన్ ఇప్పించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. వడ్డేపల్లి, అయిజ గద్వాల్ మున్సిపాలిటిలలో ఈ పోర్టల్ కొరకు ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ను నియమించి ఈ నెల చివరి  వరకు కార్మికుల పూర్తి వివారాలను పొందు పరచేలా చూడాలని మున్సిపల్ కమీషనర్ లకు ఆదేశించారు.

సమావేశం లో కార్మిక శాఖ అధికారి మహేష్ కుమార్, సంబంధిత  అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

———————————————————————–

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాలగారి చే  జారీ చేయడమైనది.

Share This Post