పత్రికా ప్రకటన,
తేదీ: 24-01- 2023,
నాగర్ కర్నూల్ జిల్లా.
భారత భవితవ్యాన్ని నిర్ణయించే బాధ్యత బాలికల భుజాల పైన ఉన్నది- లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి- జి.సబిత అన్నారు.
మంగళవారం మధ్యాహ్నం నాగర్ కర్నూల్ బాలికల జూనియర్ కళాశాల పరిధిలో హైకోర్టు ఆదేశాల మేరకు జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జి సబిత మాట్లాడుతూ భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ గారు 1996 జనవరి 24 భారత తొలి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజును జాతీయ బాలికల దినోత్సవం గా జరుపు కుంటున్నాము అని అన్నారు అన్నారు ఈ సందర్భంగా బాల్య వివాహాలు, భ్రూణ హత్యలు, లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని బాలికలకు చట్టాల పైన అవగాహన కల్పించడం జరిగింది. బాలికలు బాలురతో పాటు సమాన హక్కులు కలిగి ఉన్నారు చట్టాలు అందరికీ సమానం కనుక బాలికలు ధైర్య సాహసాలతో అన్ని రంగాలలో తమ మనసును తమ ఆధీనంలో పెట్టుకొని జీవిత లక్ష్యాలను ఛేదించాలని వివరించారు
అమ్మాయిలు తమ పరిసర ప్రాంతాలలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగినట్లు అయితే వెంటనే పోలీస్ శాఖ లేదా రెవెన్యూ శాఖ, ఉపాధ్యాయులకు సమాచారం తెలియజేసి ఇలాంటి బలవివాహాలను అరికట్టడానికి తమ వంతు కృషి చేయాలని సూచించారు ప్రస్తుతం వివాహ వయోపరిమితి బాలికలకు 18 బాలురకు 21 సంవత్సరాలుగా గా కొనసాగుతున్నది భవిష్యత్తులో బాలికలకు కూడా వివాహ వయోపరిమితి 21 సంవత్సరాలుగా పరిగణించే అవకాశం ఉన్నది అని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ భవాని,లీగల్ సర్వీసెస్ అథారిటీ కమిటీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, ఏజిపి శ్యాం ప్రసాద్, న్యాయవాదులు రామచందర్, రాజశేఖర్, బంగారయ్య గౌడ్, జగదీశ్వర్, కమిటీ సభ్యులు, కోటి సిబ్బంది కేశవరెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మి, వారి సిబ్బంది విద్యార్థినిలు పాల్గొన్నారు
……………………………
జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి నాగర్ కర్నూల్ ద్వారా జారి