భారత రత్న అంబెడ్కర్ వర్ధంతి పురస్కరించుకొని ఖైరతాబాద్ లోని కూరగాయల మార్కెట్లోని అంబెడ్కర్ విగ్రహానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగ కలెక్టర్ మాట్లాడుతూ అంబెడ్కర్ స్వాతంత్ర్య యోధుడు, న్యాయ కోవిదుడు మరియు రాజ్యాంగ నిర్మాత అని అన్నారు. భారత దేశంలోని పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచంలోని ఇతర దేశాల రాజ్యాంగంలోని విశిష్టతను తీసుకోని రాజ్యాంగాన్ని రచించారు. ఆ రోజు దేశంలో ఉన్న అసమానతలు, అస్పృశ్యతలను తొలగించడానికి ఎంతో కృషి చేసారు. బి ఆర్ అంబెడ్కర్ కొందరి వాడు కాదని అందరివాడని అన్నారు.ఆయన సూచించిన మార్గం గొప్పదని అందరు అనుసరించాలని అన్నారు.

            ఈ కార్యక్రమంలో సైఫాబాద్ ఏ సి పివేణు గోపాల్, స్థానిక నాయకులూ పాల్గొన్నారు.

 

 

????????????????????????????????????

Share This Post