భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడు న్యాయం పొందే హక్కు కలిగి ఉన్నాడని తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ వై. రేణుక తెలిపారు.

సోమవారం నాడు అజాదీ కా  అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలకు సంబంధించి నల్గొండ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు,  అడిషనల్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, పోలీస్ అధికారులు,  జిల్లా గ్రామీణ అభివృద్ధి, తహసిల్దార్లు,  ఎంపీడీవోలు,  ఐసిడిఎస్ అధికారులు,  పంచాయతీ సెక్రెటరీ లతో ఆమె మాట్లాడుతూ,  భారత రాజ్యాంగం ఆర్టికల్ 39 ప్రకారం ప్రతి పౌరుడు న్యాయం పొందే హక్కు కలిగి ఉన్నాడని, అందుకు ప్రభుత్వం అన్ని విధాల న్యాయ సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, ఈ విషయాన్ని ప్రతి పౌరుడికి తెలిసేవిధంగా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.  నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి వ్యక్తి, ముఖ్యంగా మహిళలు,  ఆర్థికంగా వెనుకబడిన వారు, పిల్లలు, వృద్ధులు ఉచిత న్యాయ సహాయం పొందడానికి అర్హులని,  ఉచిత న్యాయ సహాయం అందించడానికి జాతీయ స్థాయి నుండి మండల స్థాయి వరకు ఏర్పాటు చేయబడినట్లు తెలిపారు.  జాతీయస్థాయిలో 1987లో జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ రాజ్యాంగ పరంగా ఆమోదం లభించగా, 1995 నుండి అమలులోకి రావడం జరిగిందని, ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాల పూర్తి చేసుకున్నామని,  కానీ ఇంకా సగం మందికి కూడా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలియకపోవడం విచారకరమని,  ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని గడపగడపకు చేరే విధంగా అవగాహన కల్పిద్దామని అన్నారు.  ఉచిత న్యాయ సేవా సంస్థ ద్వారా ముఖ్యంగా మూడు కార్యక్రమాలు జరుగుతున్నాయని,   అవసరం అయిన ప్రతి పౌరునికి ఉచిత న్యాయ సహాయం అందించడం,  ఉచిత న్యాయ సహాయంపై విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం,  లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయ సహాయం అందించడం అన్నారు.  న్యాయవాది నియమించుకోలేని అర్హులైన ప్రతి పౌరునికి న్యాయవాదిని నియమించటం,  గత అక్టోబరు 2 నుండి వచ్చే నవంబర్ 14 వరకు జిల్లా స్థాయి నుండి మండల స్థాయి వరకు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు గడపగడపకు తెలిసే  విధంగా కార్యాచరణ ఉండాలని,  ముఖ్యంగా సామాజిక సమస్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ,  జిల్లాలో ఆర్టికల్ 39 ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచిత న్యాయం అందించే విధంగా,  అవగాహన పరిచే విధంగా మండలానికి ఇద్దరు చొప్పున పారా లీగల్ వాలంటీర్లను నియమించనున్నట్లు తెలిపారు.  జిల్లాలో సఖి కేంద్రంగా మహిళలకు ఉచిత న్యాయం అందించబడుతుందనే విషయాన్ని అవగాహన పరిచేందుకు అధికారులతో విస్తృత ప్రచారం చేయడం జరుగుతుందని తెలిపారు.  అర్హులైన మహిళలకు,  బాలలకు బాధిత పరిహారం సత్వరమే అదేవిధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని,  జిల్లాలో ఉచిత న్యాయ సహాయం పొందేందుకు వీలుగా సలహా కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి,  జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మందడి ఉపేందర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Share This Post