భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కింది స్థాయి ప్రజల వరకు అందేలా చూడాలి- జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్

రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయ ఆవరణలో కోవిడ్ నిబంధనలను పాటిస్తు గణతంత్ర దినోత్స వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు.

73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎందరో మహనీయులు చేసిన త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం లభించినదని, డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ అధ్యక్షతన రూపొందించిన భారత రాజ్యాంగం జనవరి 26,1950 అమలులోకి వచ్చిన నాటి నుండి మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కింది స్థాయి ప్రజల వరకు అందేలా చూడాల్సిన బాధ్యత మనందరి పై ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, దయానంద్, అసిస్టెంట్ కలెక్టర్ ఐఎఎస్ కదివరన్ ఫలనీ, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post