భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ శర్మన్ శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులు, ఉద్యోగుల తో ప్రతిజ్ఞ చేయించారు.

“భారత దేశ ప్రజలమైన మేము దేశంలో  సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగం నెలకొల్పుకునేందుకు మరియు  పౌరులందరికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, భావప్రకటన, స్వేచ్ఛ, సమానత్వం, జాతి ఐక్యతకు, వ్యక్తి గౌరవానికి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు మనకు మనంగా రూపొందించుకొన్న భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న  అంగీకరించుకొని అదిశాసనం చేసుకున్నామని ఇందుకు కట్టుబడి ఉంటామని సత్యనిష్టపూర్వకంగా ప్రమాణం చేస్తున్నట్లు” అందరి చేత ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్  వెంకటేశ్వర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్య లత  డి పి ఆర్ ఓ భాను ప్రసాద్, కలెక్టర్ కార్యాలయ ఏ ఓ అయ్యప్ప, కలెక్టర్ కార్యాలయ విభాగాల అధిపతులు, తదితరులు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు.

????????????????????????????????????

Share This Post