భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్ ఆవరణలో అధికారులు, ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించిన జాయింట్ కలెక్టర్:: స్వర్ణ లత

ప్రచురణార్థం…..2

తేది.26.11.2022.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా.

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని
జాయింట్ కలెక్టర్ స్వర్ణ లత శనివారం కలెక్టరేట్ ఆవరణలో అధికారులు, ఉద్యోగుల తో ప్రతిజ్ఞ చేయించారు.

” భారత దేశ ప్రజలమైన మేము దేశంలో సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగం నెలకొల్పుకునేందుకు మరియు పౌరులందరికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ,భావప్రకటన, స్వేచ్ఛ, సమానత్వం, జాతి ఐక్యతకు, వ్యక్తి గౌరవానికి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు మనకు మనంగా రూపొందించుకొన్న భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న అంగీకరించుకొని అదిశాసనం చేసుకున్నామని ఇందుకు కట్టుబడి ఉంటామని సత్యనిష్టపూర్వకంగా ప్రమాణం చేస్తున్నట్లు” అందరి చేత ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమంలో సి.పి.ఓ. శామ్యూల్, కలెక్టరేట్ ఏవో మహేష్ బాబు,సూపర్ఇండెంట్లు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post