భారత సంవిధానము పరిరక్షణకు కట్టుబడి అందులోని మూల సూత్రాల ఆధారంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు

భారత సంవిధానము పరిరక్షణకు  కట్టుబడి అందులోని మూల సూత్రాల ఆధారంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు. శుక్రవారం భారత సంవిధానం దినోత్సవం సందర్బంగా ఉదయం  కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉద్యోగులు అందరి చేత భారత సంవిధానము చదివించారు.  భారతదేశ ప్రజలగు మేము భారత దేశమును సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగ నెలకొల్పుటకు మరియు అందలి పౌరులెల్లరకు సామాజిక, ఆర్థిక, రాజకీయ, న్యాయమును, భావము, భావప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధన – వీటి స్వాతంత్ర్యమును, అంతస్తులోను, అవకాశములోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును, జాతిఐక్యతను, అఖండతాను తప్పక ఓనగూర్చు సౌభ్రాతృత్వమును పెంపొందించుటకు సత్యనిష్టపూర్వకముగ తీర్మానించుకుంటున్నాని ప్రతిజ్ఞ చేయించారు.  తమ ఉద్యోగము రాజ్యాంగము ద్వారా కల్పించబడినదని అందుకు అనుగుణంగా అందరూ పని చేయాలని సూచించారు.

జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post