భారత సైనిక దళ పతాక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ సైనిక సంక్షేమ శాఖకు విరాళం.

భారత సైనిక దళ పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సైనిక సంక్షేమ  శాఖకు విరాళాలు అందచేశారు. రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కల్నల్ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో నేడు ఉదయం సి.ఎస్. సోమేశ్ కుమార్ ను కలసి సైనిక సంక్షేమ ఫ్లాగ్ స్టిక్కర్ లను అందచేశారు. ఈ సందర్బంగా తన వంతు విరాళాన్ని అందచేసి, సైనిక సంక్షేమానికి విరివిగా విరాళాలు అందచేయాలని సి.ఎస్ సోమేశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

Share This Post