భారత స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ జిల్లా ప్రధాన ఆసుపత్రిని సందర్శించి ప్రసూతి వార్డులోని బాలింతలకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు.

ప్రచురణార్థం

ఖమ్మం, ఆగస్టు 19:

భారత స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ జిల్లా ప్రధాన ఆసుపత్రిని సందర్శించి ప్రసూతి వార్డులోని బాలింతలకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాతాశిశు కేంద్రంలోని కుటుంబ నియంత్రణ, ఎఎన్సి ఓపి, స్కానింగ్ గదులను పరిశీలించారు. ఎంతమంది వస్తున్నది, ఏ ఏ సేవలు అందిస్తుంది అడిగి తెలుసుకున్నారు. ప్రసూతి వార్డుల్లో బాలింతలను వైద్య సేవల గురించి, భోజనం గురించి, సిబ్బంది పట్టింపు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చిన రోగుల సహాయకులతో ఆసుపత్రిలో సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగుల సహాయకులు సేవలు చాలా బాగున్నట్లు, వైద్యం మంచిగా అందుతున్నట్లు కలెక్టర్ కు తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఆసుపత్రిలో గర్భిణులు, బాలింతలకు ఏర్పాటుచేసిన భోజన కార్యక్రమంలో వారికి కలెక్టర్ స్వయంగా భోజనం వడ్డిస్తూ, వారితో తానూ భోజనం చేశారు. అనంతరం రేడియాలజీ సర్వీసుల విభాగ భవన నిర్మాణ పనులు పరిశీలించారు. పనులు నిర్ణీత కాలవ్యవధిలో పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఆసుపత్రి పర్యవేక్షకులు డా. వెంకటేశ్వర్లు, ఆర్ఎంఓ డా. శ్రీనివాసరావు, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post