భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీల ఫైనల్ పోటీలు స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో శుక్రవారం కలెక్టర్, నగర మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి ప్రారంభించారు.

ప్రచురణార్థం

ఖమ్మం, ఆగస్టు 19:

భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీల ఫైనల్ పోటీలు స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో శుక్రవారం కలెక్టర్, నగర మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించి, వారి ప్రతిభను వెలికితీయాలనే ఉద్దేశంతో క్రీడా పోటీల నిర్వహణ చేపట్టామన్నారు. దీనిని పురస్కరించుకుని జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ను పాఠశాలల విద్యార్థుల ఆటల పోటీల నిర్వహణకు సహకరించారన్నారు. టీమ్ ఈవెంట్ ల విజేతలకు ఉమ్మడిగా మెడల్, కప్ వస్తాయని, అదే అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, చెస్, స్విమ్మింగ్, రన్నింగ్ తదితర ఆటలకు ఒక్కరే 5 నుండి 6 మెడల్స్ గెలవొచ్చని ఆయన అన్నారు. జిల్లాలో డే, రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నట్లు, విద్యార్థులు ఆటల్లో పాల్గొనెలా పాఠశాలలు ప్రోత్సహించాలని, ఎక్కడ టోర్నమెంట్స్ జరిగితే అక్కడకు తమ పిల్లలను పంపాలని ఆయన తెలిపారు. సర్దార్ పటేల్ స్టేడియంలో బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, అర్చరీ, వాలీబాల్ వంటి ఎన్నో ఆటలకు మంచి కోర్టులు ఉన్నాయని, స్టేడియం ఎప్పుడు తెరిచే ఉంటుందని, నగర పరిధిలో ఉన్న పాఠశాలల విద్యార్థులు ఉచితంగా సదుపాయాలను పొందవచ్చని, రోజు వచ్చి ఆడాలని అన్నారు. వైరాలో ఇండోర్ స్టేడియం ఉందని, మధిర, కల్లూరు లలో త్వరలో ప్రారంభం అవుతాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుచేసిందని, క్రీడల్లో రాణించి, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తాచాటాలని కలెక్టర్ అన్నారు.
కార్యక్రమంలో నగర మేయర్ మాట్లాడుతూ, చదువులతో పాటు ఆటలు ఆడాలని, ఆటలతోనే మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉంటారని అన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్, మేయర్, సుడా ఛైర్మన్ లు చెస్, బ్యాడ్మింటన్ ఆడి, క్రీడాకారులను ప్రోత్సహించారు. క్రీడాకారులకు టీ షర్టుల పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ఎస్. యాదయ్య, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి పరంధామ రెడ్డి, కార్పొరేటర్ కె. మురళి, సిఎంఓ రాజశేఖర్, ఖమ్మం బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి ఉప్పల్ రెడ్డి, ట్రెజరర్ చంద్రశేఖర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post