భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్ వద్ద ఇంటింటికి జెండా పంపిణీ ని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ జెండా ఊపి ప్రారంభించారు.

ప్రచురణార్థం

ఖమ్మం, ఆగస్టు 9:

భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్ వద్ద ఇంటింటికి జెండా పంపిణీ ని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని 4 లక్షల 66 వేల ఇండ్లకు ప్రతి ఇంటికి జెండా పంపిణీ జరిగేలా పకడ్బందీ కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలోని జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ విష్ణు ఎస్. వారియర్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, అదనపు కలెక్టర్లు మొగిలి స్నేహాలత, ఎన్. మధుసూదన్, మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, డిఆర్వో శిరీష, డీఆర్డీవో విద్యాచందన, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post