భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పండగ వాతావరణంలో నిర్వహించాలి
అగస్టు 8 నుండి 22 వరకు భారత స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాలు
అగస్టు 13 నుండి 15 వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండ ఎగరవేయాలి
వజ్రోత్సవ వేడుకల ఏర్పాట్లకు జిల్లా స్థాయిలో కమిటి ఎర్పాటు
జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
0 0 0 0
స్వాతంత్య్రన్ని సాధించుకుని 75 వసంతాలు పూర్తి చేసుకున్న శుభసందర్బంగా వేడుకల ఏర్పాట్లను ఘనంగా నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.
బుదవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లా అధికారులతో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుటకు ప్రభుత్వం ఉత్తర్వులను జారిచేసిందని, జిల్లా స్థాయి నుండి మొదలుకొని గ్రామస్థాయి వరకు ఆగస్టు 8వ తేది నుండి 22వ తేది వరకు వేడుకలు పండుగ వాతావరణం తలపించేలా నిర్వహించాలని అన్నారు. వేడుకల ఏర్పాట్లపై జిల్లాస్థాయిలో కమిటి ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా మంత్రి చైర్మన్ గా వ్యవహరిస్తారని పేర్కోన్నారు. వేడుకల నిర్వహణలో ప్రముఖులందరినిభాగస్వాములను చేయాలని అన్నారు. కార్యక్రమంలో బాగంగా ప్రతి ఇంటింటికి 20×30 సైజులో తయారు చేసిన జాతీయ జేండాను అందించడం జరుగుతుందని, జెండాల పంపిణి కొరకు జిల్లా నుండి మండలం వరకు గోడౌన్లను ఏర్పాటు చేసుకోని వాటికి గోడౌన్ ఇన్ చార్జీలను నియమించాలని సూచించారు. 11వ తేదిలోగా పంచాయితి, మున్సిపల్ శాఖల అధికారులు పంపిణి పూర్తిచేయాలని, తహాసీల్దార్లు కోఆర్డినేట్ చేస్తారని, అవసరమైన చోట యువతను బాగస్వాములను చేసుకోవాలన్నారు. 13వ తేది నుండి 15వ తేది వరకు జెండాను ప్రతి ఇంటిపై ఎగురవేసేలా అధికారులు చూడాలనిఅన్నారు. టాంటాం, కరపత్రాల ద్వారా జెండాను ఎవిధంగా ఎగురవేయాలని మొదలగు అంశాలపై అవగాహన కల్పించాలని ఆన్నారు. పంపిణి చేసిన జెండా ఇంటి పైబాగంలో గాని, ముందు బాగంలో గాని స్పష్టంగా కనిపించేలా ఉండేలా చూడాలని అన్నారు. మిగిలిన రోజులలో కవిసమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలను అధికారులకు ప్రత్యేక అధికారులను అదికారులకు ప్రత్యేక ఆదేశాలను ఇవ్వడం జరుగుతుందని పేర్కోన్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, జీవి శ్యాంప్రసాద్ లాల్, అడిషనల్ సీపీ శ్రీనివాస్, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.