భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

0 0 0 0

     75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా చేపడుతున్న భారత స్వాతంత్ర వజ్రోత్సవాలను  జిల్లాలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి  కర్ణన్ అన్నారు.

     శనివారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయా కాన్ఫరెన్స్ హాల్ లో భారత స్వతంత్ర వజ్రోత్సవంలో భాగంగా ఈనెల 8 నుంచి 22 వరకు నిర్వహించవలసిన కార్యక్రమాల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఏ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  వజ్రోత్సవ వేడుకలను పగడ్బందీగా చేపట్టి విజయవంతం చేయాలని ఆదేశించారు.

     అంతకుముందు భారత వజ్రోత్సవాలలో చేపట్టివలసిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి సోమేశ్ కుమార్  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్  మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి  పూర్తయిన నేపథ్యంలో పండగ వాతావరణం లో సీఎం కేసీఆర్ నిర్ణయించారని, ఆగస్టు 8 నుంచి 22 వరకు   కార్యక్రమాలను వజ్రోత్సాహ వేడుకల షెడ్యూల్ ప్రకారం  వహించాలని  అన్నారు. ఆగస్టు 8న నిర్వహించే ప్రారంభ కార్యక్రమానికి జిల్లాల నుంచి జడ్పిటిసిలు ఎంపీపీలు రైతుబంధు సమితి నాయకులు, మున్సిపల్ చైర్ పర్సన్లు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 563 సినిమా థియేటర్లలో పిల్లల కోసం ప్రత్యేకంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:15 నిమిషాల వరకు గాంధీ చిత్ర ప్రదర్శన జరుగుతుందని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులు చూసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

     ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ సత్యనారాయణ, అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, పిడి డిఆర్డిఏ శ్రీలతా, జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు, మున్సిపల్ కమీషనర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు.

Share This Post