భారీ వర్షాలకు ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు క్షేత్ర స్థాయిలో సిబ్బందిని అప్రమత్తం చేయాలి… జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రచురణార్ధం

భారీ వర్షాలకు ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు క్షేత్ర స్థాయిలో సిబ్బందిని అప్రమత్తం చేయాలి…

మహబూబాబాద్, సెప్టెంబర్-02:

గత రెండురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున వరదలతో ఎటువంటి ఆస్తి,ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టర్ కార్యాలయం లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో భారీ వర్షాల వలన వచ్చే వరదలకు ప్రమాదాలు సంభవించకుండా తీసుకునే చర్యలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 737 చెరువులకు గాను 526 చెరువులు పూర్తిగా నిండినందున చెరువుల వద్ద గ్రామస్థాయిలో పంచాయతీ సెక్రెటరీ లు పర్యవేక్షిస్తూ జిల్లా అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారము అందజేయాలన్నారు. జిల్లా అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తూ సలహాలు, సూచనలు అందజేయాలన్నారు. వరద ప్రవాహం వేగంగా ఉన్న కాజ్ వే ల వద్ద రెవెన్యూ పోలీసు సిబ్బంది ని నియమించి ప్రజలు పరిసర ప్రాంతాలకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ముంపు ప్రాంతాలను గుర్తించి నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు పారిశుధ్యం మెరుగు పరచాలని డి.పి.ఓ.ను ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలన్నారు. అధికారులు ముందస్తు అనుమతి లేకుండా కార్యస్థానం విడిచి వెళ్లరాదన్నారు. గ్రామస్థాయి సిబ్బంది స్థానికంగా ఉండి విధులు నిర్వహించాలన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్, కొమరయ్య, శిక్షణ కలెక్టర్ అభిషేక్ అగస్త్య , నీటిపారుదల శాఖ ఎస్.ఈ.వెంకటేశ్వర్లు, ఎస్సారెస్పీ ఈ.ఈ.లు స్టేజ్ 1. వెంకటేశ్వర్లు, స్టేజ్ 2 నారాయణ, సిపిఓ సుబ్బారావు, పంచాయతీ అధికారి రఘువరన్ తదితరులు పాల్గొన్నారు.
——————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి, మహబూబాబాద్ చే జారిచేయనైనది.

Share This Post