భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

ప్రచురణార్థం

భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

మహబూబాబాద్, సెప్టెంబర్ 27.

జిల్లాలో గత రాత్రి నుండి భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శశాంక కోరారు.

సోమవారం కలెక్టర్ కార్యాలయం నుండి గులాబ్ సైక్లోన్ వలన కురుస్తున్న భారీ వర్షాల పై ఆస్తి ప్రాణ నష్టాలు పై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత రాత్రి నుండి భారీ వర్షాలు కురుస్తున్నందున మండల ప్రత్యేక అధికారులు మండల స్థాయి అధికారులకు విధులు కేటాయించి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు.

ప్రజలు కూడా సహకరిస్తూ అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాలు జలమై ఉన్నందున వరద ప్రవాహంతో కొనసాగుతున్న లోతట్టు కాజు వేలు బ్రిడ్జీలు రోడ్లు దాటరాదన్నారు. రైతులు వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లరాదని పశువులను కూడా విడిచిపెట్టరాదన్నారు.

జలమయమైన లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచిస్తూ మండల స్థాయిలో పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసినందున వినియోగించుకోవాలన్నారు.

జిల్లాలోని 461 గ్రామ పంచాయతీలలో సమస్యాత్మక మైన ప్రాంతాలలో సిబ్బందికి విధులు కేటాయించడం జరిగిందన్నారు ఆయా ప్రాంతాలలో రెవెన్యూ, పోలీసు, నీటిపారుదల, పంచాయతీ, మత్స్య శాఖల సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు.

కేసముద్రం అర్పనపల్లి వద్ద వడ్డెర కాలనీ, గార్ల మండలం రాంపురం గూడూరు మండలంలోని పాకాల వరద వల్ల వట్టి వాగు, దంతాలపల్లి మండలంలో పెద్దముప్పారం వద్ద పాలేరు సమస్యాత్మకమైన ప్రాంతాలుగా గుర్తించి అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లోనే చెరువుల వద్ద సిబ్బందిని ఏర్పాటు చేసి, ఇసుక బస్తాలను సిద్ధం చేస్తూ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

వరద సమాచారం ప్రతి గంట గంటకు కంట్రోల్ రూమ్ నంబర్లు

ల్యాండ్ లైన్ 08719- 240400
08719- 298526 కు కాల్ చేయవచ్చన్నారు. సమాచారం తెలుపుటకు ఫోటోలు వాట్సాప్ నెంబర్ 7995074803 కు
పంపించాలన్నారు

నీటిపారుదల శాఖ అధికారులు మాట్లాడుతూ కొత్తగూడ, గంగారం మండలాలలో చెరువులు నిండి ఉన్నందున 24 గంటల విధులు సిబ్బందికి కేటాయించాలన్నారు.

భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం చేయాలని బ్యానర్స్ ప్లాగ్స్ ఏర్పాటు చేయించాలన్నారు.
ఓవర్ ఫ్లో కాజ్వే లను గుర్తించి ముందస్తుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ టెలీ కాన్ఫరెన్స్ లో ఇంజనీరింగ్ జిల్లా అధికారులు తదితరులు మండల స్థాయి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు
—————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post