భారీ వర్షాలతో ప్రజలకు ఆస్తి, ప్రాణ నష్టం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

ప్రచురణార్థం

భారీ వర్షాలతో ప్రజలకు ఆస్తి ప్రాణ నష్టం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.

మహబూబాబాద్ ఆగస్టు 30.

అధిక వర్షపాతం నమోదు అవు ఉన్నందున చెరువులు తెగిపోకుండా లోతట్టు ప్రాంతాలు జలమయం కానందున ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో హైదరాబాద్ నుండి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఉన్నత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధిక వర్షపాతం పై సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ నివేదిస్తూ నీటిపారుదల శాఖ అధికారులు రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులను అప్రమత్తంగా ఉంచడం జరిగిందని అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు చెరువుల వద్ద గ్రామస్థాయిలో సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు

జిల్లా ప్రత్యేక అధికారులను కార్యస్థానం విడిచి వెళ్లకుండా ఉండాలని ఆదేశించినట్టు తెలియజేశారు.

జిల్లాలో 48 తో పాటు 60 నెంబర్ గల ఎస్ ఆర్ ఎస్ పి కాలువలు సమీక్షిస్తూ అరవయ్యవ నెంబర్కు ఎస్ ఆర్ ఎస్ పి కాలువ నీటిని నిలిపివేయాలని ఆదేశించామన్నారు.

నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో నాలుగు మండలాల లో 272 చెరువులు ఉన్నాయని 85 చెరువులు 50 శాతంతో నీరు నిండి ఉండగా 187 చెరువులు 75 శాతం నుండి 100% వరకు నీటితో ఉన్నాయన్నారు దంతాలపల్లి, మరిపెడ మండలంలోని ఎల్లంపేట లో నీటిపారుదల శాఖ పనులు చేపట్టామన్నారు కేసముద్రం మండలం లోని సూరారం చెరువు పై దృష్టి పెట్టామని తగిన చర్యలు తీసుకుంటామన్నారు నీటి పారుదల శాఖ అధికారులు గత వర్షాలకు ముంపు ప్రాంతాల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గ్రామాలలోని పంచాయతీ సెక్రటరీలకు వివరాలు అందజేయాలన్నారు అదేవిధంగా గ్రామాలలోని ప్రధానోపాధ్యాయులకు కూడా విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించామన్నారు.

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని కంట్రోల్ రూమ్ నెంబర్ 0 8 7 19 2 4 0 4 0 0
0 8 7 19 2 9 8 5 26 నెంబర్ లకు కాల్ చేయవచ్చునని వాట్సాప్ నెంబర్ 7 9 9 5 0 7 4 8 0 3 కు మెసేజ్ చేయవచ్చని ప్రకటించామన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఎస్పి యోగేష్ గౌతం అదనపు కలెక్టర్ కొమరయ్య సి పి ఓ సుబ్బారావు నీటి పారుదల శాఖ అధికారులు ఆర్అండ్బీ అధికారులు పంచాయతీరాజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు
————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి మహబూబాబాద్ చే జారీ చేయడమైనది

Share This Post