భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలి…

ప్రచురణార్థం

భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలి…

మహబూబాబాద్, సెప్టెంబర్ 26.

వాతావరణ శాఖ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించినందున అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

ఆదివారం గులాబ్ సైక్లోన్ వలన సంభవించే భారీ వర్షాలకు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తల పై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ అధికారులకు తెలియజేశారు.

జిల్లాలో 84 గ్రామ పంచాయతీలలో సమస్యాత్మక మైన ప్రాంతాలను గుర్తించడం జరిగిందని ఆయా ప్రాంతాలలో రెవెన్యూ పోలీసు నీటిపారుదల శాఖ సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు.

కేసముద్రం అర్ప న పల్లి వద్ద వడ్డెర కాలనీ, గార్ల మండలం రాంపురం గూడూరు మండలం లో పాఠశాల వరద వల్ల వట్టి వాగు దంతాలపల్లి మండలం లో పెద్దముప్పారం వద్ద పాలేరు సమస్యాత్మకమైన ప్రాంతాలుగా గుర్తించి అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు.

కలెక్టర్ కార్యాలయంలో 24 గంటల పాటు కంట్రోల్ రూమ్ లో అందుబాటులో ఉంటుందని వరద సమాచారం ప్రతి గంట గంటకు కంట్రోల్ రూమ్కు అందజేయాలన్నారు.

నీటిపారుదల శాఖ అధికారులు మాట్లాడుతూ కొత్తగూడ గంగారం మండలాలలో 586 చెరువు లలో 18 చెరువులు నిండి ఉన్నందున 24 గంటల విధులు సిబ్బందికి కేటాయించాలన్నారు.

భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం చేయాలని బ్యానర్స్ ప్లాగ్స్ ఏర్పాటు చేయించాలన్నారు.
ఓవర్ ఫ్లో కాజ్వే లను గుర్తించి ముందస్తుగా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ రెవెన్యూ అదనపు కలెక్టర్ కొమరయ్య ఇంజనీరింగ్ అధికారులు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు
————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post