భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు సమాచారం కొరకు ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ను వినియోగించుకోవాలి ….. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రచురణార్థం

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు సమాచారము కొరకు ఫ్లెడ్ కంట్రోల్ రూమ్ ను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కోరారు.

మహబూబాబాద్ జూలై 22:

గురువారం కలెక్టర్ కార్యాలయం నుండి టెలి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గర్భిణీ స్త్రీలు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు లోతట్టు ప్రాంత ప్రజలను రిహాబిలిటేషన్ సెంటర్ నకు తరలించి భోజన వసతి కల్పించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

అంబులెన్స్ సౌకర్యం కొరకు అగ్నిప్రమాదాలను నివారించేందుకు, వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రజలు తప్పనిసరిగా కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి సేవలను పొందాలన్నారు. జిల్లాలో ఏ ఏటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కానీ జరగనీయరాదని అన్నారు. వాగులు వంకలు ప్రవహిస్తు నందున దాటరాదు అన్నారు. చెరువులు తెగిపోకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు అధికారులకు గ్రామ ప్రజలు సహకరించాలన్నారు మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేపలు పట్ట రాదని సూచించారు.

కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు…

ల్యాండ్ లైన్ 08719-240400
08719-298526

వాట్సాప్ నెంబర్
7995074803

ఫోన్ చేసిన వెంటనే అధికారులు తక్షణం స్పందించి సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేశారు.

ఈ టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, శిక్షణ కలెక్టర్ అభిషేక్ అగస్త్య అదనపు కలెక్టర్ కొమరయ్య ఇంజనీరింగ్ అధికారులు వైద్యాధికారులు, మున్సిపల్ కమిషనర్ లు, తాసిల్దార్ లు ఎంపీడీవోలు పంచాయతీ సెక్రటరీలు రెవెన్యూ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post