. భారీ వర్షాలు వరదల కారణంగా డెంగ్యూ,మలేరియా, అతిసారం వంటి వ్యాధులు వ్యాపించకుండా నియంత్రణకు యుద్ధ ప్రాతిపదికన గ్రామాల్లో, పట్టణాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు అధికారులను ఆదేశించారు.
సోమవారం హైదరాబాద్ బి ఆర్ కే భవన్ నుండి సీజనల్ వ్యాధుల నియంత్రణ, రెసిడెన్షియల్ పాఠశాలలు, బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ అంశాల పై సంబంధిత శాఖల మంత్రులు, సీఎస్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ కేసులు అధికంగా నమోదవుతున్నాయని, ఇప్పటి వరకు 1610 డెంగ్యూ కేసులు వచ్చాయని మంత్రి తెలిపారు . పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి డెంగ్యూ కేసుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రతి శుక్రవారం జిల్లాలోని గ్రామాల్లో, ఆదివారం పట్టణాలలో ఇంటింటికి ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని, దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యల పై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులను ఇందులో భాగస్వామ్యం చేయాలని మంత్రి హరీష్ రావు కలెక్టర్లకు సూచించారు. డెంగ్యూ, మలేరియా కేసులను ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స చేయడానికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నామని, మందులు, బ్లడ్ ప్లేట్ లెట్స్ ఆసుపత్రులలో అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకునే విధంగా ప్రచారం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్బా విద్యాలయాలు, మోడల్ స్కూల్స్ లలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందే విధంగా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని మంత్రిసూచించారు. ప్రభుత్వ వసతి గృహాలలో నాణ్యమైన ఆహార పదార్థాలు మాత్రమే వినియోగించాలని, పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం కల్పించాలని, ప్రతివారం రెసిడెన్షియల్ పాఠశాలలో ఫాగింగ్ చేపట్టాలని, కిచెన్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని మంత్రి సూచించారు. బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ కోసం ప్రజాసంచారం అధికంగా ఉండే బస్టాండ్లు, రైల్వే స్టేషన్ మార్కెట్లలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని, గ్రామాలు మున్సిపాలిటీలో ఇంటింటా సర్వే నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికి బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ వేయాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలతో విద్యాశాఖ అధికారులు సమన్వయం చేసుకుని విద్యార్థులకు వ్యాక్సిన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి మాట్లాడుతూ గ్రామాలలో మురికి కాలువలను పరిశుభ్రo చేయాలని, మిషన్ భగీరథ ట్యాంకులను శుభ్రం చేయాలని, పైప్ లైన్ లీకేజీలను అరికట్టాలని సూచించారు. గ్రామాలలో ప్రజలు వేడి నీళ్లు తాగాలని , టాం టాం ద్వారా వారికీ అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. పంచాయత్ కార్యదర్శులు ఎంపీడీవోలు ఏఎన్ఎం, ఆశ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా సమన్వయంతో పని చేయాలన్నారు. హోటల్, షాపుల వద్ద పరిసరాలు పరిశుభ్రత బాధ్యత యాజమాన్యులకు ఉంటుందని, అపరిశుభ్రంగా ఉన్న దుకాణాలపై భారీ జరిమానా విధించాలని మంత్రి ఆదేశించారు. స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్లు ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పారిశుద్ధ్య నిర్వహణను పర్యవేక్షించాలని మంత్రి సూచించారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ అధికారి, వైద్య ఆరోగ్యశాఖ అధికారి సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వంద శాతం వ్యాక్సినేషన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ వసతి గృహాలను జిల్లా విద్యాశాఖ అధికారి, సంక్షేమ శాఖ అధికారులు వారానికి ఒకసారి తనిఖీ చేయాలని, వసతి గృహాల్లో విద్యార్థులతో పాటు భోజనం చేసి నాణ్యత ప్రమాణాలను పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. వసతి గృహాల్లో బియ్యం పాత వాటిని తొలగించాలని, పాఠశాలలో సానిటేషన్, పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, దోమలు వ్యాప్తి చెందకుండా యాంటీ లార్వా స్పేస్ చేయాలని ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని అన్నారు.
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని,తరచూ వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించాలని, వసతి గృహాలు, పరిసరాలలో పరిశుభ్రత పాటించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ వసతి గృహాలలో ఉన్న పాత బియ్యం స్టాక్ స్థానంలో నూతనంగా బియ్యం సరఫరా చేస్తున్నామని, వాటిని వినియోగించుకోవాలని సూచించారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 2 లక్షల 12 వేల మంది విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం నుంచి బియ్యం కొనుగోలుకు అంగీకరించినందున రైస్ మిల్లులు త్వరితగతిన ప్రారంభించి సకాలంలో బియ్యం సరఫరా జరిగే విధంగా అధికారులు పర్యవేక్షించాలని మంత్రి సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైస్ మిల్లుల త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని, ప్రతిరోజు 2 షిఫ్టులలో బియ్యం మిల్లింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని సిఎస్ సూచించారు. జిల్లాలో గ్రామ రెవెన్యూ అధికారులు వివిధ శాఖల్లో ఖాళీలలో నియమించాలని, దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసిందని సీఎస్ సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ శ్రీహర్ష , జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చందు నాయక్, జిల్లా పంచాయతీ అధికారి శ్యాం సుందర్ ,షెడ్యుల్ద్ కులాల అభివృద్ది అధికారిని శ్వేత ప్రియదర్శిని, మున్సిపల్ కమిషనర్ జానకి రామ్ సాగర్ , జిల్లా ఎస్సీ,ఎస్ టి, బి సి మైనార్టీ శాఖల అధికారులు, ఎంపిడీఓలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
తదనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ అది కారులు, వైద్య ఆరోగ్య అధికారులు సమన్వయంతో టీం లాగా ఏర్పడి పని చేయాలనీ, జిల్లా లో ఒక్క డెంగ్యు కేసు కూడా నమోదు కాకుండా చూసే బాద్యత మీ అందరి పై ఉందని, గద్వాల్, అయి జ , వడ్డేపల్లి, ఆలంపూర్ మున్సిపల్టీలలో ప్రతి రోజు ఫాగింగ్ అయ్యేటట్లు చూడాలని, డ్రై నేజి లలో ఆయిల్ బాల్స్ వేయాలని, ప్రతి ఇంటికి వెళ్లి చెక్ చేయాలనీ అధికారులకు ఆదేశించారు.
—————————————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చేజారి చేయబడినది.