భారీ వర్షాల దృష్ట్యా ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు.

బుధవారంనాడు హనుమకొండ కలక్టరేట్ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, రాష్ట్రప్రభుత్వఛీఫ్ విప్ వినయ్ భాస్కర్ తో కలిసి వర్షాలు‌, రహదారులు‌, పాఠశాలలో మౌళిక వసతుల కల్పనపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో ఉండి పర్యవేక్షించాలని అన్నారు. వరద నిర్వహణ కోసం శాశ్వత ప్రాతిపదికన పగడ్బందీగా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. విష జ్వరాలు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. గ్రామాల్లో నిరంతరం శానిటేషన్ పనులు ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు. నీరు నిలవకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో వివిధ నిర్మాణాలకు టెండర్లును తక్షణమే పిలావలని తెలిపారు.అక్రమ నిర్మాణాలపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. గత సంవత్సరం కురిసిన వర్షాల కంటే ఈ సంవత్సరం నష్టాన్ని తగ్గించగలిగామని అన్నారు. గ్రామీణా రోడ్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఉమ్మడి జిల్లా లో వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇండ్లు,రహదారుల గురించి అధికారులను ఆరా తీశారు. జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ప్రతి పాఠశాల ను ప్రతిరోజూ శుభ్రం చేయాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడకుండా కోవిడ్ నిబంధనలు పాటించాలని అన్నారు. ప్రతి పాఠశాల కు ప్రత్యేక అధికారులను నియమించుకోవాలని ఆదేశించారు. నిరంతరం పాఠశాల లను పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఈ సంవత్సరం విద్యాశాఖకు ఎనిమిదివేల కోట్ల రూపాయల కేటాయింపు జరిగిందని, ప్రవైటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని అన్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కలక్టర్లు తగిన శ్రద్ధ చూపాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేయడానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. మిషన్ భగిరధ గురించి మాట్లాడుతూ మిషన్ భగిరధ ద్వారా నీటి సరఫరా లో వచ్చే ఇబ్బందులను అధికమించాలని, మిషన్ భగీరథ పనులపై నివేదిక సమర్పించాలని కమీషనర్ ను ఆదేశించారు. రోడ్ల మరమ్మత్తు లకు మండలానికి యాభై లక్షల రూపాయల ను కేటాయిస్తుట్లు తెలిపారు. వినాయక చవితి పండుగ ను ప్రణాళిక బద్దంగా చేసుకోవాలని కోరారు.

ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ హన్మకొండ నగరంలోని అమరావతి నగర్, సమ్మయ్య నగర్ లో, స్మార్ట్ సిటీ పెండింగ్ రోడ్ల వర్క్ లను త్వరిత గతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సూచించారు.

హనుమకొండ కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, కలక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూం ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు జిల్లాలో వర్ష సగటు శాతం 17 శాతంగా ఉందని అన్నారు. పాఠశాలలో పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమించామని అన్నారు. రహదారుల మరమ్మతులు చేపడుతున్నామని అన్నారు.

వరంగల్ కలక్టర్ గోపి మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాలలో రవాణా సౌకర్యలను పునరుద్ధరణ చేసినట్లు వివరించారు. వరంగల్ జిల్లలో దాదాదాపు ఎనిమిది వందల చెరువులు పూర్తి స్థాయిలో నిండా యని అన్నారు.

ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ, వరంగల్ జిల్లా పరిషత్ ఛైర్మన్ లు డాక్టర్ సుధీర్ కుమార్, గండ్ర జ్యోతి, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, తాటికాయల రాజయ్య, ఆరూరి రమేష్, కమిషనర్ ఆఫ్ పోలీస్ తరుణ్ జోషి, గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రావీణ్య, వరంగల్ అడిషనల్ కలెక్టర్ హరి సింగ్, హనుమకొండ, వరంగల్ ఆర్డీవోలు వాసు చంద్ర, మహేందర్ జి, హన్మకొండ, వరంగల్ జిల్లాల ఉన్నత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post